IPL 2025 Mega Auction: కేవలం 13 ఏళ్లకే ఐపీఎల్ వేలంలో, అత్యంత పిన వయస్సుడిగా రికార్డ్
IPL 2025 Mega Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగావేలం మరోసారి సంచలనాలకు వేదిక కానుంది. ఈసారి వేలంలో దిగ్గజ స్టార్ క్రికెటర్లతో పాటు అత్యంత పిన వయస్సు కుర్రోడు అదృష్టం పరీక్షించుకోనున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్నోడితడే.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ జరిగిన ప్రతిసారీ అద్భుతాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి మరో అద్భుతం జరగనుంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. ఐపీఎల్ బోర్డ్ కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసింది. ఆ వివరాలు మీ కోసం.
ఐపీఎల్ 2025 మెగా వేలం ఈసారి సౌదీ అరేబియాలోని జెడ్డాలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. అయితే ఈసారి జరిగే వేలంలో అందరి దృష్టి ఆ కుర్రోడిపైనే పడనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఆ కుర్రోడి వయస్సు కేవలం 13 ఏళ్లు. ఐపీఎల్ చరిత్రలో ఇంత తక్కువ వయస్సులో రిజిస్టర్ అవడం ఇదే మొదటిసారి. అటు ఐపీఎల్ బోర్డు షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో కూడా ఈ కుర్రోడున్నాడు. ఈ కుర్రోడి పేరు వైభవ్ సూర్యవంశి.
30 లక్షల బేస్ ప్రైస్‌తో వేలంలో దిగనున్న ఈ కుర్రోడు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవాడు. 2011లో పుట్టిన ఈ కుర్రోడు ప్రస్తుతం టీమ్ ఇండియా అండర్ 19కు కూడా ఎంపికయ్యాడు. కేవలం 13 ఏళ్ల వయస్సులో ఇదెలా సాధ్యమనుకుంటున్నారా...ఇలాంటి అసాధ్యాలు చాలా చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా చాలా దూకుడిగా ఆడే స్వభావమే ఇతడిని అడుగెట్టిన ప్రతిచోటా ఎంపికయ్యేలా చేసింది. నాలుగేళ్ల వయస్సుకే బ్యాట్ పట్టిన వైభవ్ సూర్యవంశి పదేళ్ల వయస్సులోనే అండర్ 16 బీహార్ జట్టులోకి వచ్చాడు. ఆ తరువాత వినూ మన్కడ్ ట్రోఫీలో ప్రతిభ చూపించాడు. బీహార్ తరపున ఈ ఏడాదిలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగెట్టాడు. ఇక ఆ తరువాత టీమ్ ఇండియా అండర్ 19కు సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం 2024-25 రంజీలో ఆడుతున్నాడు.
ఇప్పుడు ఐపీఎల్ 2025 వేలంలో కేవలం 13 ఏళ్ల వయస్సులోనే రంగంలో దిగి ఫ్రాంచైజీలను ఆకట్టుకోనున్నాడు. మరి వేలంలో ఏ ఫ్రాంచైజీ ఇతడిని దక్కించుకుంటుందో చూడాలి.
Also read: Gold Rate Today: వారం తరువాత స్వల్పంగా పెరిగిన బంగారం, మీ నగరంలో బంగారం ధర ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.