Chennai Super Kings get back Deepak Chahar for Rs 14 crores: టీమిండియా యువ పేసర్ దీపక్ చహర్ ఎప్పుడైనా నక్కతోక తొక్కడేమో. అందుకే బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) చహర్‌ను ఏకంగా రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇది రెండో అత్యధిక ధర. టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను ముంబై ఇండియన్స్ రూ.15.25 కోట్లకు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీపక్ చహర్ రెండు కోట్ల కనీస ధరతో ఐపీఎల్ 2022 వేలంలోకి వచ్చాడు. ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ దీపక్ కోసం వేలం ఆరంభించింది. రాజస్థాన్ రాయల్స్ ప్రాంచైజీ నుంచి హైదరాబాద్ జట్టుకు గట్టి పోటీ ఎదురైంది. అయినా కూడా హైదరాబాద్ వెనకడుగు వేయలేదు. 10 కోట్లు దాటగానే అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రేసులోకి వచ్చింది. ఇక రాజస్థాన్, చెన్నై మధ్య రసవత్తర పోరు జరిగింది. చివరకు చెన్నై చహర్‌ను కైవసం చేసుకుంది. 



నిజానికి చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2021 టైటిల్ గెలవడంలో దీపక్ చహర్ కీలక పాత్ర పోషించాడు. అయితే నిబంధల కారణంగా అతడిని చెన్నై అట్టిపెట్టుకోలేకపోయింది. దాంతో ఈ వేలంలో ఎలాగైనా దక్కించుకోవాలని చుసిన చెన్నై.. ప్రణాళిక ప్రకారం భారీ ధరకు కొనుగోలు చేసింది. దీపక్ ధర ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కంటే ఎక్కువ. మహీకి చెన్నై 12 కోట్లు చెల్లిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఫాన్స్ అందరూ షాక్ అవుతున్నారు. 


Also Read: Ishan Kishan MI: ఇషాన్ కిషన్‌పై కాసుల వర్షం.. 'తగ్గేదేలే' అంటూ భారీ ధరకు కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్!!


Also Read: IPL Auction 2022: ఏందిది.. కావ్యపాప! ఒక్కరిని కొనకుండా.. పైసలు అన్ని ఏం చేసుకుంటావ్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook