IPL Auction 2022: ఏందిది.. కావ్యపాప! ఒక్కరిని కొనకుండా.. పైసలు అన్ని ఏం చేసుకుంటావ్!!

SRH Kaviya Maran: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కరిని కూడా తీసుకోకపోవడంతో వారి వద్ద 60 కోట్లు అలానే ఉన్నాయి. దాంతో వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్ కావ్య మారన్ అనుసరిస్తున్న తీరుపై అభిమానులు మండిపడుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2022, 04:21 PM IST
  • ఐపీఎల్‌ 2022 మెగా వేలం షురూ
  • ఒక్కరిని కొనకుండా.. పైసలు ఏం చేసుకుంటావ్ కావ్యపాప
  • వానిందు హసరంగా కోసం బిడ్డింగ్ వేసినా
IPL Auction 2022: ఏందిది.. కావ్యపాప! ఒక్కరిని కొనకుండా.. పైసలు అన్ని ఏం చేసుకుంటావ్!!

SRH CEO Kaviya Maran gets trolled by Netizens: ఎప్పటిలానే ఈసారి కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో ఇప్పటివరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఫ్రాంచైజీ ఒక ఆటగాడిని కూడా తీసుకోలేదు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో సన్‌రైజర్స్ యాజమాన్యం మౌనంగా ఉండిపోయింది. మార్కీ (అత్యంత ముఖ్యమైన) ఆటగాళ్ల కోసం వేలం జరుగుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్ కావ్య మారన్ అలా చూస్తూ ఉండిపోయారు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రాంచైజీలో ఒక్క స్టార్ ఆటగాడు కూడా చేరలేదు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో రూ.68 కోట్ల పర్స్ మనీని పెట్టుకొని టాప్ ప్లేయర్లందరినీ వదిలేసింది. మార్కీ ప్లేయర్స్ లిస్ట్‌లో టాప్ 10 క్రికెటర్స్‌కు కనీసం బిడ్ కూడా వేయలేదు. చివరకు మనీష్ పాండే కోసం బిడ్ వేసింది. ఈ సీజన్ మెగావేలంలో సన్‌రైజర్స్ వేసిన తొలి బిడ్ ఇదే. ఢిల్లీ క్యాపిటల్స్ రంగంలోకి దిగడంతో ఎస్‌ఆర్‌హెచ్‌  వెనక్కి తగ్గింది. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ రూ. 4.60 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. 

ఇక శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగా కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ బిడ్డింగ్ వేసింది. ముందునుంచి అతడి కోసం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే పంజాబ్ కింగ్స్ మధ్యలో వదిలేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సన్‌రైజర్స్ ప్రాంచైజీకి గట్టి పోటీ ఇచ్చింది. ఆక్షనర్ (వేలం నిర్వహించే వ్యక్తి) హగ్ హెడ్మెడెస్ ఉన్నట్టుండి స్టేజ్ మీదే కుప్పకూలిపోగా వేలం మధ్యలో ఆగిపోయింది. తిరిగి ఆరంభం కాగా బెంగళూరు అతడిని కైవసం చేసుకుంది. 

ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కరిని కూడా తీసుకోకపోవడంతో వారి వద్ద 60 కోట్లు అలానే ఉన్నాయి. దాంతో వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కో ఓనర్ కావ్య మారన్ అనుసరిస్తున్న తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. సన్‌రైజర్స్ ఏ ఆటగాళ్లను తీసుకోవాలనుకుంటుంది అని అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. 'ఏందిది.. కావ్యపాప', 'ఒక్కరిని కొనకుండా.. పైసలు అన్ని ఏం చేసుకుంటావ్ కావ్య' అంటూ ఫాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read: IPL 2022 Auctioneer: ఐపీఎల్ 2022 వేలంలో అపశృతి.. గుండెపోటుతో కుప్పకూలిన ఆక్షనర్ హెడ్మెడెస్!!

Also Read: IPL Auction 2022 Jason Holder: భారీ ధర పలికిన జాసన్ హోల్డర్.. లక్నో జట్టులో అందరూ స్టార్లే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News