Mumbai Indians buy Ishan Kishan for Rs 15.25 crores: టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషాన్ జాక్ పాట్ కొట్టాడు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 మెగా వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ.15.25 కోట్లకు కైవసం చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్ 2022 వేలంలో ఇదే అత్యధిక ధర. ఇంతకుముందు భారత స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత కొంత కాలంగా ఇషాన్ కిషాన్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. బ్యాటర్, వికెట్ కీపర్‌గా జట్టుకు సేవలు అందించాడు. భారీ షాట్లతో విరుచుకుపడడం అతడి ప్రత్యేక శైలి. అయితే నలుగురు ఆటగాళ్లనే రిటైన్ చేసుకోవాలన్న నిబంధనతో ముంబై అతన్ని రిటైన్ తీసుకోలేదు. దాంతో మెగా వేలంలో ఇషాన్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని చూసింది. అందుకోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ గట్టి పోటీ ఇచ్చినా తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్లింది. చివరకు ఇషాన్ కిషన్‌ను ముంబై రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. 


ఇషాన్ కిషన్ కనీస ధర రూ. 2 కోట్లు. ఇషాన్ కోసం మొదటగా ముంబై ఇండియన్స్ వేలం ప్రారంభించింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ వేలం పాడింది. దీంతో వేలం ఆరు కోట్లకు చేరుకుంది. అప్పుడే గుజరాత్ టైటాన్స్ కూడా పోటీలోకి వచ్చి రూ.10 కోట్ల వరకు పాడింది. ఈ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రేసులోకి వచ్చింది. అతడి కోసం వేలం పాడింది. ఇషాన్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తీవ్ర పోటీ తర్వాత ఇషాన్‌ను ముంబై సొంతం చేసుకుంది. దాంతో సొంత గూటికే అతడు చేరాడు. 



2016 వేలంలో తొలిసారిగా గుజరాత్ లయన్స్ ఇషాన్ ఇషాన్‌ను కొనుగోలు చేసింది. అప్పుడు 20 లక్షల బేస్ ధరకు కొనుగోలు చేసింది. రెండేళ్ల పాటు ముంబై ఫ్రాంచైజీలో ఉన్నాడు కానీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. 2018 వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 6.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇషాన్ 2020 సీజన్‌లో ముంబై తరపున 14 మ్యాచ్‌లలో 57.33 సగటుతో 516 పరుగులు చేశాడు. 2021లో 241 పరుగులు చేశాడు. ఇప్పుడు మళ్లీ ముంబైనే కొనుగోలు చేసింది. 


Also Read: IPL Auction 2022: ఏందిది.. కావ్యపాప! ఒక్కరిని కొనకుండా.. పైసలు అన్ని ఏం చేసుకుంటావ్!!


Also Read: IPL 2022 Auctioneer: ఐపీఎల్ 2022 వేలంలో అపశృతి.. గుండెపోటుతో కుప్పకూలిన ఆక్షనర్ హెడ్మెడెస్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook