IPL Gujarat vs Delhi: ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ ఆరు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 46 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 86 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ తర్వాత కెప్టెన్ పాండ్యా (31) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ సాధించాడు. మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ 20కి మించి పరుగులు చేయలేకపోయారు. ఢిల్లీ బౌలర్లలో ముస్తఫిజుర్ 3 వికెట్లు, ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుజరాత్ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీ షా (10), టిమ్ సీఫెర్ట్ (3) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. మూడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన మన్‌దీప్ సింగ్ కూడా (18) స్వల్ప స్కోర్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో 34 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం కెప్టెన్ రిషబ్ పంత్, లలిత్ యాదవ్ క్రీజులో ఉన్నారు.


ఇప్పటివరకూ ఢిల్లీ, గుజరాత్ చెరో మ్యాచ్ ఆడగా.. రెండు జట్లు అందులో విజయం సాధించాయి. ముంబైతో మ్యాచ్‌లో గెలుపొంది ఐపీఎల్‌లో ఢిల్లీ బోణీ కొట్టగా.. లక్నోతో మ్యాచ్‌లో గెలుపొంది గుజరాత్ బోణీ కొట్టింది. ఇక తాజా మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 


Also Read: Srilanka Crisis: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం... దేశవ్యాప్తంగా 36 గంటల కర్ఫ్యూ..


Beast Movie Trailer: విజయ్ దళపతి 'బీస్ట్' మూవీ ట్రైలర్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook