LSG vs DC Highlights: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ కీలక విజయాన్ని సొంతం చేసుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన రిషబ్‌ పంత్‌ జట్టు ఆరో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో లక్నో సూపర్‌ జియంట్స్‌ను కట్టి పడేసి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కీలక విజయం పొందింది. బంతులు మిగిలిండగానే మ్యాచ్‌ను నెగ్గి రన్‌రేట్‌ను మెరుగుపర్చుకుంది. చావోరేవో పరిస్థితుల్లో ఉన్న రిషబ్‌ పంత్‌ సేన సత్తా చాటింది. హ్యాట్రిక్‌ విజయాలతో దూకుడు మీద ఉన్న లక్నోకు పరాభవం ఎదురైంది.
Also Read: IPL Live Score 2024 MI vs RCB: ఓటమికి కేరాఫ్‌గా బెంగళూరు.. సిక్సర్ల సునామీతో ముంబై ఇండియన్స్‌ భారీ విజయం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నో విధించిన సాధారణ లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ సునాయాసంగా ఛేదించింది. 4 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని సాధించింది. డేవిడ్‌ వార్నర్‌ (8) దురదృష్టవశాత్తు ఔటైన సమయంలో పృథ్వీ షా చెలరేగి ఆడాడు. జాక్‌ ఫ్రాజర్‌ మెక్‌గార్క్‌ బ్యాటింగ్‌కు వచ్చి విజృంభించాడు. 5 సిక్స్‌లతో చెలరేగగా.. 2 ఫోర్లు సాధించి 55 పరుగులు సాధించాడు. పంత్‌ కెప్టెన్‌ ఇన్సింగ్‌ ఆడి ... పరుగులు జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరలో ట్రిస్టన్‌ స్టబ్స్‌ (15), షాయ్‌ హోప్‌ (11) దీటుగా ఆడి విజయాన్ని అందించారు. తక్కువ స్కోర్‌ను కాపాడుకోవడంలో లక్నో బౌలర్లు విఫలమయ్యారు. ఢిల్లీ పరుగులు సాధించకుండా ఏమాత్రం నియంత్రించలేకపోయారు. రవి బిష్ణోయ్‌ 2, నవీన్‌ ఉల్‌ హక్‌, యశ్‌ ఠాకూర్‌ ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు.
Also Read: PBKS vs SRH Highlights: ఉత్కంఠ మ్యాచ్‌లో హైదరాబాద్‌ విజయం.. పంజాబ్‌ ఓటమి


 


హ్యాట్రిక్‌ విజయాలతో జోష్‌ మీద ఉన్న లక్నో సూపర్‌ జియంట్స్‌ అనూహ్యంగా టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగింది. అతివిశ్వాసమో ఏమిటో తెలియదు కానీ బ్యాటింగ్‌కు లక్నో భారీ లక్ష్యం నిర్దేశించలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టాపార్డర్‌ క్వింటాన్‌ డికాక్‌ (19), కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (39) మోస్తారు స్కోర్‌ చేశారు. మిడిలార్డర్‌ మొత్తం కుప్పకూలింది. దేవదత్‌ పడిక్కల్‌ (3), మార్కస్‌ స్టోయినిస్‌ (8), నికోలస్‌ పూరన్‌ (0) డకౌట్‌ అయ్యాడు. దీపక్‌ హుడా (10) తక్కువ స్కోర్‌కే పరిమితమైంది.

కష్టాల్లో ఉన్న జట్టుకు ఆయూశ్‌ బదౌన్‌ ఆయుష్షు పోశాడని చెప్పవచ్చు. 35 బంతుల్లో 55 పరుగులు చేసి అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీకి గౌరవప్రదమైన లక్ష్యాన్ని ఆయుశ్‌ విధించాడు. అతివిశ్వాసంతో బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఢిల్లీ బౌలర్లు బుద్ధి చెప్పారు. ఏమాత్రం పరుగులు సాధించకుండా మొదటి నుంచి మంచి నియంత్రణతో బౌలింగ్‌ వేశారు. కుల్దీప్‌ యాదవ్‌ బంతులతో ప్రత్యర్థిని కట్టడి చేశాడు. 20 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. ఖలీల్‌ అహ్మద్‌ 2, ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌ కుమార్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter