IPL Media Rights: ఐపిఎల్ మీడియా రైట్స్ ఇ-వేలం.. బిసిసిఐని అభినందించిన జీ గ్రూప్
IPL Media Rights Tender e-auction: ఐపిఎల్ మీడియా రైట్స్ టెండర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేయడంతో పాటు టెండర్ల ఇ-వేలం ఎంపిక ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన బిసిసిఐని జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అభినందించింది.
IPL Media Rights Tender e-auction: ఐపిఎల్ మీడియా రైట్స్ టెండర్ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తిచేయడంతో పాటు టెండర్ల ఇ-వేలం ఎంపిక ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన బిసిసిఐని జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ అభినందించింది. ఐపిఎల్ మీడియా హక్కుల టెండర్ల బిడ్డింగ్‌లో కీలక పాత్ర పోషించిన బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, బిసిసిఐ కార్యదర్శి జే షా, కోశాధికారి అరుణ్ ధుమాల్‌ల నాయకత్వాన్ని ప్రశంసించిన జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ బిజినెస్ విభాగం అధ్యక్షుడు రాహుల్ జోహ్రీ.. జీ గ్రూప్ కూడా ఆహ్లాదకర వాతావరణంలో టెండర్లలో పాల్గొనేందుకు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జీ గ్రూప్ సంస్థ గురించి రాహుల్ జోహ్రీ మాట్లాడుతూ.. ''సంస్థతో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ లబ్ధి చేకూరేలా జీ గ్రూప్ బిజినెస్ నిర్ణయాలు ఉంటాయి'' అని అన్నారు. అలాగే స్పోర్ట్స్ ప్రాపర్టీలను సైతం అదే దృక్పథంతో చూడటం జరుగుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రాహుల్ జోహ్రీ మీడియాకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 నుంచి 2027 వరకు ఐపిఎల్ మీడియా రైట్స్‌కి సంబంధించిన ఇ వేలం ప్రక్రియ నేడు ముగిసిన సందర్భంగా జీ గ్రూప్ ఈ ప్రకటన విడుదల చేసింది.
ఇదిలావుంటే, ఈ వేలం ప్రక్రియలో స్టార్ ఇండియా రూ.23,575 కోట్లు వెచ్చించి ఐపిఎల్ టీవీ హక్కులు సొంతం చేసుకోగా.. ముఖేష్ అంబానికి చెందిన వయాకామ్ 18 డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన టైమ్స్ ఇంటర్నెట్‌కి సైతం డిజిటల్ రైట్స్‌లో భాగస్వామ్యం లభించింది.
Also read : IPL Media Rights: ముగిసిన వేలం.. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ రికార్డు బద్దలు! ఐపీఎల్ మీడియా హక్కుల జాబితా ఇదే
Also read : Bhuvneshwar Kumar T20 Record: మరొక్క వికెటే.. టీ20ల్లో చరిత్ర సృష్టించనున్న భువనేశ్వర్ కుమార్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook