Star India bags IPL TV rights, Viacom18 gets digital rights: ప్రపంచ క్రికెట్ అభిమానులతో పాటు దిగ్గజ క్రీడా లీగ్ నిర్వాహకులలో ఆసక్తి రేపిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల వేలం ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ వేలంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై కాసుల వర్షం కురిసింది. 2023-27 సంబంధించిన ఐపీఎల్ ప్రసార హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ ఖజానాలోకి రూ. 48,390.52 కోట్లు చేరాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఐపీఎల్.. తాజాగా మీడియా హక్కుల పరంగా మరో రికార్డును బద్దలు కొట్టింది. ప్రముఖ ఫుట్‌బాల్ లీగ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను వెనక్కునెట్టిన ఐపీఎల్.. విలువ పరంగా ప్రపంచంలో టాప్-2 లీగ్‌గా నిలిచింది.
ఐపీఎల్ 2023-27 సీజన్ వరకూ టీవీ ప్రసార హక్కులను స్టార్ నెట్‌వర్క్ దక్కించుకుంది. ఇందుకుగాను బీసీసీఐకి స్టార్ నెట్‌వర్క్ రూ.23,575 కోట్లు చెల్లించనుంది. గతంలో కూడా స్టార్ టీవీ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక డిజిటల్ రైట్స్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ (వయాకామ్18) కైవసం చేసుకుంది. ఇందుకు గాను బీసీసీఐ ఖజానాలో రూ.23,773 కోట్లు చేరనున్నాయి. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. డిజిటల్ హక్కులలో వయాకామ్ పాటగా టైమ్స్ ఇంటర్నెట్ కూడా భాగమైంది.
ఇక ఒక్కో మ్యాచ్ విలువ విషయంలో ఈపీఎల్‌ను ఐపీఎల్ అధిగమించి రెండో స్థానానికి చేరింది. ఈపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 85 కోట్లు (11 యూఎస్ మిలియన్ డాలర్లు) కాగా.. ఐపీఎల్‌లో రూ. 107.5 కోట్లకు (13.4 యూఎస్ మిలియన్ డాలర్లు)గా ఉంది. గతంలో ఐపీఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండగా.. తాజాగా వేలం ద్వారా భారత టీ20 విలువ ఒక్కసారిగా పెరిగింది. టీవీ, డిజిటల్ హక్కుల ద్వారా ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ విలువ రూ. 107.5 కోట్లకు చేరింది. ఈ జాబితాలో అమెరికన్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) ఐపీఎల్ కంటే ముందుంది. ఎన్ఎఫ్ఎల్‌లో ఒక్కో మ్యాచ్ విలువ రూ. 133 కోట్లు.
వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, అమేజాన్, జీ గ్రూప్, గూగుల్, స్కై స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి దిగ్గజ కంపెనీలు ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అయితే వయాకామ్, అమేజాన్ ఐపీఎల్ మీడియా బిడ్డింగ్ నుంచి తప్పుకున్నాయి. చివరకు వయాకామ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఐపీఎల్ 2023-27 సీజన్ టీవీ, డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నాయి. డిజిటల్ రైట్స్‌ని దక్కించుకున్న వయాకామ్ 18కి చెందిన వూట్‌లో ఐపీఎల్ ప్రసారం కానుందని సమాచారం.
Iam thrilled to announce that STAR INDIA wins India
TV rights with their bid of Rs 23,575 crores. The bid is a direct testimony to the BCCI’s organizational capabilities despite two pandemic years.— Jay Shah (@JayShah) June 14, 2022
Viacom18 bags digital rights with its winning bid of Rs 23,758 cr. India has seen a digital revolution & the sector has endless potential. The digital landscape has changed the way cricket is watched. It has been a big factor in the growth of the game & the Digital India vision.
— Jay Shah (@JayShah) June 14, 2022
Also Read: Raai Laxmi Bikini Pics: రాయ్ లక్ష్మి అందాల విందు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవ్!
Also Read: Tejasswi Prakash Pics: హద్దుల కంచె చెరిపేసిన తేజస్వి ప్రకాష్.. ఆ అందాలు చూస్తే మతి పోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook