IPL 2023: ఆర్‌సీబీ జట్టుపై ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్.. ఈసారి కూడా కష్టమే..!
Aakash Chopra on RCB: ఈసారి అయినా ఐపీఎల్ టైటిల్ తమ జట్టు గెలుచుకుంటుందని ఆర్‌సీబీ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సీజన్లో బెంగుళూరు టాప్-3కి కూడా చేరడం కష్టమేనని అన్నారు.
Aakash Chopra on RCB: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముగిసిపోవడంతో భారత క్రికెట్ అభిమానులు అందరూ ఇప్పుడు ఐపీఎల్ కోసం ఎదురుచూస్తున్నారు. మార్చి 31 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుండగా.. మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈసారి 12 స్టేడియాల్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మూడేళ్ల తర్వాత అన్ని జట్లు తమ సొంత మైదానంలో ఆడనుండడంతో అభిమానులు నేరుగా స్టేడియాలకు వెళ్లి చూసే అవకాశం దక్కింది. ఇక ఏ జట్టు ఫైనల్‌కు చేరుతుంది..? ఏ జట్టు టైటిల్ గెలుస్తుంది..? ఎవరు ఈసారి బాగా ఆడతారు అంటూ అప్పుడే మాజీలు అంచనా వేస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఈసారి తమ అభిమాన జట్టు ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారు. గత 15 ఏళ్లలో ఒక్కసారి కూడా టైటిల్ ఆర్‌సీబీ టైటిల్ గెలవలేదు. ఈసారి కూడా బెంగుళూరు టాప్-3లోకి చేరకపోవచ్చని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అంచనా వేశారు. బెంగుళూరు జట్టు టైటిల్ గెలవాలని తాను కూడా అనుకుంటున్నానని.. కానీ బహుశా ఈసారి టాప్-3లోకి రాకపోవచ్చన్నారు. నాలుగు లేదా ఆరు స్థానాల్లో ఈ సీజన్‌ను ముగించే అవకాశం ఉందన్నారు.
ఆర్‌సీబీ బౌలర్ల గురించి ఆకాష్ చోప్రా మాట్లాడారు. 'జట్టు ఎక్కడికి వెళ్లాలో బౌలర్ల పర్ఫామెన్స్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్‌లో బలంగా ఉంది. వానిందు హసరంగా కీలకంగా మారే అవకాశం ఉంది. జోష్ హేజిల్‌వుడ్ ఆడకపోతే ఆర్‌సీబీ పెద్ద ఎదురుదెబ్బ' అని ఆయన అన్నారు. జోష్ హేజిల్‌వుడ్ లేకుండా జట్టు బౌలింగ్ బలహీనంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
గాయం కారణంగా టీమిండియాతో టెస్టు, వన్డే సిరీస్‌కు హేజిల్‌వుడ్ దూరమైన విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండకపోవచ్చని భావిస్తున్నారు. రీస్ టాప్లీ, డేవిడ్ విల్లీ, మహ్మద్ సిరాజ్, సిద్ధార్థ్ కౌల్, హర్షల్ పటేల్, కరణ్ శర్మ, ఆకాష్‌దీప్ వంటి బౌలర్లు ఉన్నా.. జోష్ హేజిల్‌వుడ్ లేకపోతే అది జట్టును చాలా బలహీనపరుస్తుందని ఆకాశ్ చోప్రా అన్నారు.
Also Read: Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష.. ఎంపీ సభ్యత్వం రద్దు..?
Also Read: Ind Vs Aus: నీ యవ్వ తగ్గేదేలే.. డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్‌లో సంబురాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి