Ben Stokes might replace Moeen Ali in in CSK vs SRH Match: ఐపీఎల్‌ 2023లో భాగంగా నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్ జట్లు చేయ 5 మ్యాచ్‌లు ఆడాయి. ఐపీఎల్ 26వ సీజన్లో ధోనీ సేన మూడింట్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మరోవైపు  హైదరాబాద్ రెండు విజయాలు సాధించి పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. దాంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచుకు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందినట్లు సమాచారం తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లు ఆడని సీఎస్‌కే స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ పూర్తి ఫిట్‌నెస్‌ (Ben Stokes Injury Update) సాధించాడట. ప్రస్తుతం స్టోక్స్ నెట్‌లో ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. బౌలింగ్‌ఎం బ్యాటింగ్ చేస్తూ కనిపించదు. దాంతో హైదరాబాద్‌తో నేడు జరగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. స్టోక్స్ చెన్నై తుది జట్టులోకి వస్తే.. మొయిన్ అలీపై వేటు పడనుంది. స్టోక్స్ సహా డెవాన్ కాన్వే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ విదేశీ కోటాలో ఆడనున్నారు.  


ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇప్పటివరకు బెన్ స్టోక్స్ రెండు మ్యాచ్‌లే ఆడాడు. మ్యాచ్‌లలో విఫలమయిన స్టోక్స్ కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. భారీగా పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. దాంతో ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లోనైనా స్టోక్స్‌ ఫామ్ అందుకోవాలని సీఎస్‌కే యాజమాన్యంతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో ఇంగ్లండ్‌ టెస్టు కెప్టెన్‌ స్టోక్స్‌ను రూ.16.25 కోట్ల భారీ ధరకు సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మిగతా జట్లతో పోటీపడి మరీ సొంతం చేసుకుంది. 


చెన్నై తుది జట్టు (CSK playing XI vs SRH):
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్‌ ధోనీ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరణ, ఆకాష్ సింగ్‌. 


Also Read: CSK vs SRH IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎంఎస్ ధోనీకి సూపర్ ట్రాక్ రికార్డ్.. మరీ ఇంతలా బాదాడా!  


Also Read: Twitter Blue Tick: ట్విటర్ బ్లూ టిక్ కోల్పోయిన ధోనీ, కోహ్లీ, రోహిత్.. అసలు కారణం ఇదే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.