Chennai Super Kings: ప్లేఆఫ్స్‌కు ముందు చెన్నై షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
Ben Stokes Leaves CSK Camp: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టుకు దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌తోపాటు యాషెస్ సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు చెన్నై క్యాంప్ నుంచి స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని చెన్నై ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Ben Stokes Leaves CSK Camp: గతేడాది గ్రూప్ దశలోనే నిష్క్రమించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరుతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 17 పాయింట్లతో టేబుల్ టాప్-2లో నిలిచింది. ఈ నెల 23న గుజరాత్ టైటాన్స్‌తో తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు చెన్నైకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఐర్లాండ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్, అనంతరం యాషెస్ సిరీస్ ఉండడంతో స్టోక్స్ ఇంగ్లాండ్‌కు పయనమయ్యాడు.
గతేడాది జరిగిన మినీ వేలంలో బెన్ స్టోక్స్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై. ఇతర జట్ల నుంచి పోటీ ఎదురైనా.. భారీ ధర వెచ్చింది దక్కించుకుంది. అయితే స్టోక్స్‌కు కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో స్టోక్స్ పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఒకఓవర్ వేసి.. 18 పరుగులు ఇచ్చాడు. స్టోక్స్ చేతికి ధోనీ మళ్లీ బంతిని అప్పగించలేదు. స్టోక్స్ స్థానంలో జట్టులోకి వచ్చిన అజింక్యా రహానే దుమ్ములేపాడు.
జూన్ 1 నుంచి ఇంగ్లాండ్, ఐర్లాండ్ జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ టెస్టు జట్టు కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్.. జట్టుకు సారథ్యం వహించాల్సి ఉంది. ఈ టెస్ట్ మ్యాచ్ తరువాత ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ కూడా ప్రారంభంకానుంది. దీంతో ప్రతిష్టాత్మాక సిరీస్‌కు సిద్ధమయ్యేందుకు స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బెన్ స్టోక్స్ పునరాగమనానికి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
బెన్ స్టోక్స్ జట్టుకు దూరమైనా చెన్నై జట్టుకు పెద్దగా ప్రభావం పడదు. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో చెన్నై జట్టు ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగింది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లోనూ బెన్ స్టోక్స్ ఉన్నా.. బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉండేది. ఈ సీజన్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది.
Also Read: Kishan Reddy: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ..!
Also Read: IPL 2023 Playoffs: మారిపోయిన ప్లేఆఫ్స్ లెక్కలు.. నాలుగు జట్లు ఔట్.. ఒక బెర్త్‌కు మూడు టీమ్‌లు ఫైట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి