Chiranjeevi Car Fancy Number: లగ్జరీ కారుకు ఫాన్సీ నెంబర్ కొనేసిన చిరు.. ఫాన్సీ నంబర్ ఎన్ని లక్షలో తెలుసా..?
Chiranjeevi Fancy Number for his Toyota Vellfire: మెగాస్టార్ చిరంజీవి టయోటా వెల్ ఫైర్ అనే కారుని కొనుగోలు చేశారు, ఈ కారు కోసం ఆసక్తికరమైన నెంబర్ దక్కించుకున్నారు.
Chiranjeevi Buys Fancy Number for his Toyota Vellfire: సెలబ్రిటీలు భారీ ధర వెచ్చించి తమకు ఇష్టమైన లగ్జరీ కార్లు దక్కించుకోవడమే కాదు ఆయా లగ్జరీ కార్లకు వాహనాలకు తమకు ఇష్టమైన ఫ్యాన్సీగా అనిపించే నెంబర్లను కూడా అత్యధిక ధర చెల్లించి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి దగ్గర అనేక లగ్జరీ కార్లు ఉన్నాయనే సంగతి అందరికీ తెలిసిందే.
మార్కెట్లోకి ఎలాంటి లగ్జరీ కార్ వచ్చినా మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక లగ్జరీ కారులకు అధిపతి అయిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరొక లగ్జరీ కారు సొంతం చేసుకున్నారు. టయోటా వెల్ ఫైర్ అనే కారుని ఆయన కొనుగోలు చేశారు. ఈ కారు ధర దాదాపు కోటి రూపాయల పై మాటే. తాజాగా ఈ కారుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ కారు కోసం ఆసక్తికరమైన నెంబర్ దక్కించుకున్నారు.
టీఎస్ 09 జీబీ 111 1 నెంబర్ దక్కించుకోవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు చెల్లించారు. ఈమేకు ఖైరతాబాద్ లో రిజిస్ట్రేషన్ కూడా జరిపించారు. మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా తన కార్లన్నింటికీ వన్ అనే నెంబర్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే 1111 నెంబర్ కోసం మెగాస్టార్ చిరంజీవి 4,70,000 వెచ్చించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: Sanjay Dutt Injured: షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. సంజయ్ దత్ కి తీవ్ర గాయాలు
ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం భోళా శంకర్ అనే సినిమా రూపొందుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకి ఈ సినిమా తెలుగు రీమేక్ ఈ సినిమాని డైరెక్టర్ మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటింస్తోంది. ఇక కీర్తి సురేష్ సరసన సుశాంత్ నటిస్తున్నట్లు ఇటీవల ఒక ప్రకటన వెలువడింది.
ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉంది. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించాల్సిన ఈ సినిమా విషయం మీద ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ మెగాస్టార్ చిరంజీవి చివరిగా అధికారిక ప్రకటన వచ్చింది మాత్రం మెగాస్టార్ వెంకీ కుడుముల కాంబినేషన్ గురించే. అయితే ఆయన మరికొందరు దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది.
ఇదీ చదవండి: Sanjay Dutt Injured: షూటింగ్లో బాంబ్ బ్లాస్ట్.. సంజయ్ దత్ కి తీవ్ర గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook