CSK vs DC IPL 2023 Highlights: ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జెత్రయాత్ర కొనసాగుతోంది. ప్లే ఆఫ్‌లో దాదాపు అడుగుపెట్టేసింది. బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. చెన్నై బ్యాట్స్‌మెన్లలో ఏడుగురు 20 పైగా పరుగులు చేయడం విశేషం. ఆఖర్లో కెప్టెన్ ఎంఎస్ ధోని మెరుపులు మెరిపించాడు. అనంతరం ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది.  ఈ సీజన్‌లో చెన్నైకు ఇది 7వ విజయం. ప్రస్తుతం 15 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరువ అయింది. మరో 2 మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచినా.. అధికారికంగా బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్ హైలెట్. తనలోని ఫినిషర్‌ను మరోసారి బయటపెట్టాడు. ఖలీల్ అహ్మద్ వేసిన 19వ ఓవర్‌లో చెలరేగి ఆడాడు. 2 సిక్సర్లు, ఒక ఫోర్‌తో చుక్కలు చూపించాడు. కేవలం 9 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ధోని క్రీజ్‌లో ఉంది కాసేపే గానీ.. చెపాక్ స్టేడియం మొత్తం ధోని పేరుతో మారుమోగిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో ధోని సిక్సర్లు బాదుతున్న సమయంలో కూతురు జీవా, భార్య సాక్షి ఆనందానికి అవధులు లేవు. స్టాండ్స్‌లో కూర్చొని ధోని బ్యాటింగ్‌ను తెగ ఎంజాయ్ చేశారు. జీవా వైపు కెమెరామెన్ పదే పదే ఫోకస్ చేశారు. చప్పట్లు, విజిల్స్‌తో తండ్రి ధోనిని ఉత్సాహపరిచింది జీవా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 


 




ఈ సీజన్‌లో ధోని 204 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తుండడం విశేషం. గత సీజన్‌లో చెన్నై గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఈ సారి ధోని కెప్టెన్సీలో గొప్పగా పుంజుకుంది. వరుసగా విజయాలతో ప్లే ఆఫ్‌కు గట్టిపోటీదారుగా మారింది. ధోనీ ఇప్పటివరకు 8 ఇన్నింగ్స్‌లలో 96 పరుగులు చేశాడు. ఇందులో స్ట్రైక్ రేట్ 204.26గా ఉంది. ధోనీ ఆరుసార్లు నాటౌట్‌గా నిలిచాడు. 


 




ఈ మ్యాచ్‌లో ఓటమితో ఢిల్లీ ప్లే ఆఫ్‌ ఆశలు గల్లంతయ్యాయి. 11 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో 8 పాయింట్లతో చివరిస్థానంలో ఉంది. మిగిలిన మూడు మ్యాచ్‌లు నెగ్గినా.. నెట్ రన్‌రేట్ చాలా తక్కువగా ఉండడంతో ప్లే ఆఫ్‌ చేరుకోవడం దాదాపు అసాధ్యం. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించిన ఢిల్లీ.. చెన్నైతో మాత్రం బ్యాటింగ్‌లో విఫలమై మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకుంది. 


Also Read: Karnataka Assembly Elections 2023: ఈ సాలా విక్టరీ నమ్దే.. కర్ణాటకలో నేడే పోలింగ్‌.. ఓటరు తీర్పుపై ఉత్కంఠ..!  


Also Read: IPL 2023 Points Table: టాప్-3లోకి దూసుకువచ్చిన ముంబై.. ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే..?   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook