Ravindra Jadeja React on batting order ahead of MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ) అందించడంతో పాటు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు నాలుగు టైటిల్స్ అందించాడు. ధోనీ బ్యాటింగ్, కెప్టెన్సీనే అతడిని అత్యుత్తమ నాయకుడిని చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఐపీఎల్ ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. ఏడాదికి ఓసారి వచ్చే ఐపీఎల్‌లో ధోనీ ఆట చూసేందుకు ఫాన్స్ ఎగబడతారు. ఇక మహీ క్రీజులో ఉంటే చాలు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోతారు. ప్రస్తుత ఐపీఎల్‌లో అదే జరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ 2023 ఎంఎస్ ధోనీకి చివరి సీజన్‌ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ స్టేడియం మొత్తం నిండిపోతుంది. మైదానం ఏదైనా ధోనీ నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. చెన్నై సొంత మైదానం లేదా ప్రత్యర్థి సొంత మైదానం అయినా పసుపు వర్ణంతో స్టేడియం నిండిపోతోంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో ధోనీ ఆట చూసేందుకు వేలాది మంది తరలి వచ్చారు. వాంఖడే స్టేడియం కూడా పసుపు మయం అయింది. అక్కడ మహీకి బ్యాటింగ్‌ చేసే అవకాశం రాకున్నా.. తన ఫ్యాన్స్‌ కోసం ప్యాడ్స్‌ కట్టుకుని వారిని కాసేపు అలరింకెహ్డు. ఇక చెపాక్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా?. ఫాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. గత రాత్రి ఇదే జరిగింది. 


బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంబటి రాయుడు అవుట్‌ కాగానే ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. 9 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్స్‌లతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే మైదానం మొత్తం సందడిగా మారింది. అందుకు తగ్గట్టుగానే మహీ తనదైన షాట్లతో అభిమానులను ఖుషీ చేశాడు. ధోనీ క్రేజ్‌ దృష్ట్యా జియో సినిమా బ్రేక్ సమయంలో యాడ్‌ కూడా వేయలేదు. మైదానంలో ధోనీనే చూపించాడు. అంతటి క్రేజ్ ధోనీకి ఉంది. ఈ క్రేజ్ పైనే చెన్నై స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ కంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తాను ముందుకు వస్తే.. ఫాన్స్ త్వరగా ఔట్ కావాలని కోరుకుంటారన్నాడు. 


మ్యాచ్ అనంతరం రవీంద్ర జడేజా మాట్లాడుతూ తాను టాప్‌ ఆర్డర్‌లో రాకపోవడానికి గల కారణాలను వెల్లడించాడు. 'బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నేను ముందుకు రాకపోవడంపై చాలా మంది అడుగుతుంటారు. మైదానంలో ఎంఎస్ ధోనీ బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు హోరెత్తించే అభిమానుల హంగామాను చూడటం చాలా బాగుంటుంది. ఒకవేళ నేను ముందుగా బ్యాటింగ్‌కు వస్తే.. త్వరగా ఔటై పోవాలని అభిమానులు కోరుకుంటురు. అందుకే మహీ తర్వాత బ్యాటింగ్ చేస్తా. ధోనీ ఢిల్లీపై అద్భుతంగా ఆడాడు. ఫాన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఢిల్లీపై విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది' జడేజా చెప్పాడు. 


'చెపాక్ పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించడం బాగుంది. ఎక్కువగా ఇద్ద సాధన చేయడం వల్ల ఎలాంటి లెంగ్త్‌, పేస్‌తో బంతిని వేయాలనే అవగాహన మాకు ఉంది. ఇక్కడకు వచ్చే జట్టు మాత్రం పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి. సొంత మైదానంలో ఉన్న అడ్వాంటేజ్‌ను మేం ఉపయోగించుకున్నాం. కలిసికట్టుగా ఆడి విజయం సాధించాం' అని రవీంద్ర జడేజా చెప్పాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై అద్భుత విజయం సాధించింది. పొదుపైన బౌలింగ్‌, దూకుడైన బ్యాటింగ్‌తో చెన్నై విజయంలో జడేజా కీలక పాత్ర పోషించి.. ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్‌లో 16 బంతుల్లో 21 పరుగులు చేసిన జడేజా.. నాలుగు ఓవర్ల కోటాలో ఒక వికెట్‌ తీసి19 పరుగులు ఇచ్చాడు. 


Also Read: Hyundai Cars Discount & Offers: ఈ 3 హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్‌.. చివరి తేదీకి ముందే కోనేసేయండి!


Also Read: 2023 Upcoming Electric SUVs: టాటా పంచ్, హ్యుందాయ్ క్రెటా సహా.. ఈ 6 ప్రసిద్ధ ఎస్‌యూవీల ఎలక్ట్రిక్ వెర్షన్స్ వస్తున్నాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.