Chennai Super Kings vs Gujarat Titans Final Live Updates: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎడతెరిపిలేని వర్షంతో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఆఖరి ఫైట్ ఇంకా ఆరంభంకాలేదు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో టాస్ మరింత ఆలస్యం కానుంది. వర్షం కారణంగా ఆదివారం మ్యాచ్ ప్రారంభంకాకపోతే.. ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేని కూడా ఉంచారు. ఈ రోజు మ్యాచ్‌ జరగకపోతే సోమవారం నిర్వహించనున్నారు. గుజరాత్-ముంబై జట్ల మధ్య జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్‌కు కూడా వరుణుడు అంతరాయం కలించాడు. మ్యాచ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై-గుజరాత్ జట్ల మధ్య జరగాల్సి ఈ మ్యాచ్‌ 9:40కి ఆట ప్రారంభమైతే 20-20 ఓవర్ల ఆటను నిర్వహిస్తారు. ఒకవేళ అంతలోపు వర్షం ఆగకపోతే సమయాన్ని బట్టి ఓవర్లు కుదిస్తారు.  రాత్రి 11:56 గంటలకు డెడ్‌లైన్ పెట్టుకున్నారు. ఇంతలోపు మ్యాచ్‌ ఆరంభమైనా 5-5 ఓవర్ల మ్యాచ్ నిర్వహిస్తారు. ఐదు ఓవర్ల ఆట కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ నిర్వహించాలనే నిబంధనలు ఉంది. సూపర్ ఓవర్‌కు కూడా అవకాశం లేకపోతే.. సోమవారం రిజర్వే డే సందర్భంగా మ్యాచ్‌ నిర్వహిస్తారు. వర్షం ఆగిపోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.


పాయింట్ల పట్టికలో టాప్-2 స్థానాలతో గుజరాత్, చెన్నై జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. క్వాలిఫైయర్-1లో గుజరాత్‌ను ఓడించి చెన్నై ఫైనల్‌ పోరుకు రెడీ అయింది. రెండో క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో ముంబైను ఓడించిన గుజరాత్.. వరుసగా రెండో సీజన్‌లో ఫైనల్‌లో అడుగుపెట్టింది. రెండు జట్లు బలంగా ఉండడంతో పోరు ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉండగా.. వరుణుడు మాత్రం శాంతించట్లేదు. 


గతేడాది గ్రూప్ దశలోనే నిష్క్రమించిన చెన్నై.. ఈసారి అద్భుతంగా పుంజుకుంది. ధోనీ కెప్టెన్సీలో ఐదో టైటిల్ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. బ్యాటింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, దీపక్ చాహర్, పతిరన, తీక్షణ చెన్నైకు ప్రధానం బలం. అటు హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ గత సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ ఫైనల్‌కు చేరుకుంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్ వెన్నముకగా నిలవగా.. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ గుజరాత్ విజయాల్లో కీరోల్ ప్లే చేస్తున్నారు. ధోనికి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చెన్నై జట్టు విజయం సాధించాలని ఎక్కువ మంది క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. 


తుది జట్లు ఇలా.. (అంచనా)


చెన్నై సూపర్ కింగ్స్: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మతిషా పతిరణ


గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ


Also Read: CSK Vs GT Dream11 IPL Final Match Dream11 Prediction: ఐపీఎల్ ఫైనల్‌కు వేళయా.. గుజరాత్‌కు చెన్నై చెక్ పెడుతుందా..? డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇవే..


Also Read: CSK Vs GT IPL 2023: క్షణాల్లో మ్యాచ్‌ మార్చేసే వీరులు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి