Ahmedabad Weather Forecast Today for IPL 2023 Finals: ఆదివారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. నిన్న ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అహ్మదాబాద్‌లో మధ్యాహ్నం నుంచి ఎడతేరిపి లేకుండా కురిసిన వర్షానికి కనీసం టాస్‌ కూడా పడలేదు. రాత్రి 11 దాటినా వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రిజర్వేడే అయిన సోమవారంకు వాయిదా వేశారు. అహ్మదాబాద్‌ వాతావారణం అభిమానులకు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ రోజునైనా మ్యాచ్‌ జరగుతుందా? లేదా? అని ఆందోళన చెందుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనున్న అహ్మదాబాద్‌లో ప్రస్తుతం ఎండ బాగా కాస్తోంది. అక్కడ పొడి వాతావరణం ఉంది. నేటి ఉదయం నుంచి అహ్మదాబాద్‌లో వర్షం కురవలేదు. అక్కడ ప్రస్తుతం 35 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. మ్యాచ్ సజావుగా సాగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అహ్మదాబాద్‌ వాతావరణంకు సంబంధించిన ఫోటోలను ఫాన్స్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ ట్వీట్స్ చూసిన ఫాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. 


చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అరగంట ముందుగా టాస్ పడనుంది. నేడు సమయానికి మ్యాచ్ మొదలైతే.. పూర్తి ఓవర్లు జరుగుతాయి. అయితే ఈరోజు వ‌ర్షం కురిసే అవ‌కాశం 40 శాతం మాత్రమే అని అహ్మదాబాద్‌ వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. కాబట్టి ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌ జరిగే అవకాశాలు ఎక్కువ. కనీసం ఐదు ఓవర్లు లేదా సూపర్ ఓవర్ అయినా పడుతుంది. 


ఐపీఎల్‌ 2023 సీజన్‌ ఎంఎస్ ధోనీకి చివరిది కావొచ్చన్న ఊహాగానాల మధ్య తమ అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియానికి మహీ ఫాన్స్ పోటెత్తారు. భారీగా తరలివచ్చిన చెన్నై ఫ్యాన్స్‌తో స్టేడియం పరిసరాలు మొత్తం పసుపు మయం అయింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్ నేటికి వాయిదా పడడంతో ఫాన్స్ నిరాశ చెందారు. ఈ రోజు ఫైనల్ జరగనున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన అభిమానులు స్టేడియాన్ని వీడి.. అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనే నిద్రించారు.
Also Read: Apple iPhone 14 Discount: భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర.. ఏకంగా 33 వేల బంపర్ ఆఫర్!


Also Read: CSK vs GT IPL 2023 Final: గుజరాత్‌తో ఫైనల్.. చెన్నైకి శుభ సూచకం! టైటిల్ ఇక ధోనీ సేనదే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook.