DC Players’ Bats Stolen: ఢిల్లీ క్యాపిటల్స్ మాల్ చోరీ.. బ్యాట్స్, షూస్, థై ప్యాడ్స్ అన్నీ మాయం
DC Players’ Bats Stolen: ఐపిఎల్ చరిత్రలో ఇలా ఆటగాళ్ల వస్తుసామాగ్రి చోరీకి గురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
DC Players’ Bats Stolen: పాపం.. ఇప్పటికే ఐపిఎల్ 2023 లో పూర్ పర్‌ఫార్మెన్స్‌తో కొట్టుమిట్టాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దొంగల రూపంలో మరో కొత్త కష్టం వచ్చిపడింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆటగాళ్లకి చెందిన బ్యాట్లు, ప్యాడ్స్, షూస్, థై ప్యాడ్స్ అన్నీ ఎవరో ఎత్తుకుపోయారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో మ్యాచ్ ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ఆటగాళ్లు తమ కిట్ బ్యాగ్స్ చెక్ చేసుకోగా.. అందులో బ్యాట్స్, ప్యాడ్స్, షూస్, థై ప్యాడ్స్, గ్లోవ్స్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మిస్ అయ్యాయి. చోరీకి గురైన వస్తు సామాగ్రి విలువ లక్షల్లోనే ఉంటుందని తెలుస్తోంది.
ఆదివారం ఢిల్లీకి చేరుకున్న ఆటగాళ్లు తమ కిట్స్ చెక్ చేసుకున్నాకే తెలిసింది తమ ఆటవస్తువులు చోరీకి గురయ్యాయని. ఆటగాళ్లంతా తమది ఏదో ఒకటి పోవడం గుర్తించి షాక్ అయ్యారు. మొత్తం 16 బ్యాట్స్ చోరీకి గురైనట్టు గుర్తించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఇదే విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అదివారం నాడు జరిగిన ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్‌లో ఒక సీనియర్‌ని జీ తెలుగు న్యూస్ సంప్రదించగా.. ఆ వివరాలు వెల్లడించేందుకు వారు నిరాకరించారు. ఇది జట్టుకు చెందిన అంతర్గత విషయమని.. చోరీ విషయం వారు చూసుకుంటారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సదరు సీనియర్ పేర్కొన్నారు.
ఐపిఎల్ చరిత్రలో ఇలా ఆటగాళ్ల వస్తుసామాగ్రి చోరీకి గురవడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ పోలీసులు, ఎయిర్ పోర్ట్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇండియన్స్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ డీసీపీ దేవేష్ కుమార్ మహ్ల సైతం ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫిర్యాదును ధృవీకరించినట్టు సమాచారం.
ఐపిఎల్ 2023 లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. రేపు ఏప్రిల్ 20న 28వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఇది 6వ మ్యాచ్ అవుతుంది.
ఇది కూడా చదవండి : Dhoni Almost Hits Deepak Chahar: చెన్నై బౌలర్‌ని బ్యాట్‌తో కొట్టినంత పనిచేసిన ధోనీ
ఐపిఎల్ 2023 పాయింట్స్ పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 5 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 8 పాయింట్స్‌తో నెంబర్ 1 ర్యాంక్‌లో ఉండగా.. ఆడిన అన్ని ఆటల్లోనూ ఓటమిపాలై 0 పాయింట్స్‌తో 10 జట్లలో చివరి స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. మొదటి ఐదు స్థానాల్లో సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్, కే.ఎల్. రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్, మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, హార్థిక్ పాండ్య కేప్టేన్సీలోని గుజరాత్ టైటాన్స్, శిఖర్ ధావన్ కేప్టేన్‌గా వ్యవహరిస్తున్న పంజాబ్ కింగ్స్ జట్లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Virat Kohli Vs Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి మరోసారి ఇచ్చిపారేసిన కోహ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK