Dinesh Karthik Trolls: లాస్ట్ బాల్ డ్రామా.. RCB కొంపముంచిన దినేశ్ కార్తీక్! ఓడే మ్యాచ్‌లో గెలిచిన లక్నో
Cricket Fans Trolls Dinesh Karthik: చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పిదం కారణంగా లక్నో విజయం సాధించింది.
Netizens Brutally Trolls Dinesh Karthik: ఐపీఎల్ 2023లో రసవత్తర మ్యాచులు జరుగుతున్నాయి. ఆదివారం గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల హైఓల్టేజ్ మ్యాచ్ జరగ్గా.. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరుపై లక్నో ఒక్క వికెట్ తేడాతో గెలిచింది. చివరి బంతి ఉన్న నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో అని స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులతో పాటు టీవీలకు అతుక్కుపోయిన కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురుచూశారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు ఆర్‌సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (64; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఫాఫ్ డుప్లెసిస్ (79 నాటౌట్; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ బాధగా.. హిట్టర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ (59; 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) చెలరేగాడు. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. మార్కస్ స్టోయినిస్ (65; 30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (62; 19 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఓడిపోయే మ్యాచులో పూరన్ చెలరేగడంతో లక్నో ఊహించని విజయాన్ని అందుకుంది. సిక్స్‌లతో విరుచుకుపడ్డ పూరన్.. మ్యాచును బెంగళూరు చేతుల్లోంచి లాగేసుకున్నాడు.
చివరి బంతికి ఒక్క పరుగు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్‌సీబీ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (Dinesh Karthik Trolls) తప్పిదం కారణంగా లక్నో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో లక్నో విజయానికి 6 పరుగులు అవసరం అయ్యాయి. మార్క్ వుడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన హర్షల్ పటేల్.. బెంగళూరు శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. రవి బిష్ణోయ్ డబుల్‌తో పాటు సింగిల్ తీసి మ్యాచ్‌ను టై చేశాడు. దాంతో 2 బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సి వచ్చింది. ఐదవ బంతికి జయదేవ్ ఉనద్కత్ క్యాచ్ ఔటవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరింది.
చివరి బంతికి ఆవేశ్ ఖాన్ క్రీజులోకి రాగా.. హర్షల్ పటేల్ యార్కర్ బాల్ వేశాడు. బ్యాట్‌కు బంతి తగలకపోయినా పరుగు కోసం ఆవేశ్ పరుగెత్తాడు. బంతిని అందుకోవడంలో విఫలమయిన కీపర్ దినేశ్ కార్తీక్.. కలెక్ట్ చేయడంలో లేట్ చేశాడు. అంతేకాదు త్రో వేసినా.. వికెట్లకు బంతి తగలలేదు. దాంతో లక్నో విజయాన్ని అందుకుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫాన్స్ అందరూ ఎంఎస్ ధోనీని పోల్చుతూ.. డీకేను ఆటాడుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి