Chris Jordan in IPL: ప్రస్తుతం బౌలింగ్‌లో అత్యంత బలహీనంగా జట్టు ఏదైనా ఉందంటే అది ముంబై ఇండియన్స్ అని చెప్పొచ్చు. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా రెండు సీజన్లకు దూరమయ్యాడు. రెండేళ్ల వేలంలో కొన్న జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ అందుబాటులోకి వచ్చాడు. బుమ్రా లేని లోటు తీరుస్తాడని ముంబై అభిమానులు అనుకున్నారు. అయితే ఏడు మ్యాచ్‌ల్లో ఆర్చర్ కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. ఆ రెండింటిలో కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. గాయం కారణంగా ఆర్చర్ బెల్జియం వెళ్లిపోయాడని వార్తలు వైరల్ అవ్వగా.. వాటిని ఈ స్టార్ బౌలర్ ఖండించాడు. అయితే తదుపరి ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడనే క్లారిటీ కూడా లేదు. గాయం పూర్తిగా నయం అవ్వకుండానే ఆర్చర్ ఆడుతున్నాడనే అనుమానాలకు తావిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ముంబై మేనేజ్‌మెంట్ రెడీ అయింది. మిగిలిన మ్యాచ్‌ల కోసం ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్‌ను జట్టులోకి తీసుకుంది. అయితే ఏ ఆటగాడి స్థానంలో జోర్డాన్‌ను జట్టులో చేర్చుకున్నారో ఇంకా తెలియజేయలేదు. జోర్డాన్ చేరికతో బౌలింగ్ విభాగం స్ట్రాంగ్‌గా మారుతుందని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. లోయర్ ఆర్డర్‌లో జోర్డాన్ బ్యాటింగ్ కూడా చేయగలడు. 


ఐపీఎల్‌లో నాలుగు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు జోర్డాన్. 2016 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుఫున ఆడాడు. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్ జట్టలో కూడా భాగమయ్యాడు. గత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడే అవకాశం లభించింది. మొత్తం ఇప్పటివరకు ఐపీఎల్ 28 మ్యాచ్‌లు ఆడిన జోర్డాన్.. 30.85 సగటుతో 27 వికెట్లు పడగొట్టాడు. జోర్డాన్ ఎకానమీ  9.32 రేటుతో పరుగులు ఇచ్చాడు. డేత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడం జోర్డాన్ స్పెషాలిటీ. ఇంగ్లాండ్ తరఫున 87 టీ20 మ్యాచ్‌ల్లో 27.31 సగటుతో 96 వికెట్లు పడగొట్టాడు.


ముంబై ఇండియన్స్ జట్టు విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మిగిలిన నాలుగింటిలో ఓటమి పాలైంది. బ్యాట్స్‌మెన్ పర్వాలేదనిపిస్తున్నా.. బౌలింగ్ విభాగం వీక్‌గా ఉండడంతో ముంబై జట్టు భారీగా పరుగులు సమర్పించుకుంటోంది. నేడు రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధించి.. సెకండాఫ్‌ను ఘనంగా ప్రారంభించాలని చూస్తోంది. అందులోనూ ఈ రోజు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. 


Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  


Also Read: New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook