Gautam Gambhir Angry Celebration: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ గంభీర్! వైరల్ వీడియో
Gautam Gambhir Angry Celebration, LSG Mentor Gautam Gambhir warns RCB Fans in Bengaluru. లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని విజయం తర్వాత ఆ ఆజట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ తనను తాను నియంత్రించుకోలేకపోయాడు.
LSG Mentor Gautam Gambhir aggressive Celebrations goes viral after RCB Defeat: సోమవారం చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చివరి బంతికి అద్భుత విజయాన్ని సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్స్ కోల్పోయి ఛేదించింది. విదేశీ ప్లేయర్స్ మార్కస్ స్టొయినిస్ (65), నికోలస్ పూరన్ (62) అర్థ శతకాలు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో దూసుకెళ్లిపోయింది. ఐపీఎల్ 2023లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచుల్లో మూడు విజయాలు సాధించి మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ (79 నాటౌట్; 46 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), విరాట్ కోహ్లీ (61; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (59; 29 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. భారీ లక్ష్య ఛేదనలో లక్నో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో మార్కస్ స్టోయినిస్ జట్టును ఆదుకున్నాడు. స్టోయినిస్ ఔట్ అయ్యాక లక్నో ఓటమి ఖాయంగా అనిపించింది. ఈ సమయంలో నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లు బాదుతూ.. లక్నో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. దాంతో లక్నో రేసులోకి వచ్చింది.
19వ ఓవర్‌లో భారీ షాట్ ఆడిన బదోని.. బంతిని చూస్తూ బ్యాట్‌ను స్టంప్స్‌కు తాకించేశాడు. దీంతో అతడు హిట్ వికెట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. చివరి ఓవర్లో 5 పరుగులు అవసరం కాగా.. హర్షల్ పటేల్ వేసిన రెండో బంతికి మార్క్ వుడ్ బౌల్డయ్యాడు. తర్వాతి 2 బంతుల్లో 3 పరుగులు వచ్చాయి. దాంతో స్కోర్లు సమమయ్యాయి. ఐదో బంతికి జయదేవ్ ఉనద్కత్ ఔట్ అయ్యాడు. ఇక చివరి బంతికి హర్షల్.. రవి బిష్ణోయ్‌ను మన్కడింగ్ చేశాడు. అయితే అది నాటౌట్ అని తేలింది. ఆరో బంతి వేయగా.. అవేష్ షాక్ షాట్ ఆడలేకపోయినా బై కోసం ప్రయత్నించాడు. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ బంతిని ఆదుకోకపోగా.. రనౌట్ చేయలేకపోవడంతో మ్యాచ్ లక్నో సొంతమైంది.
లక్నో సూపర్ జెయింట్స్ ఊహించని విజయం తర్వాత ఆ ఆజట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir Angry Celebration) తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. కోపంతో ఊగిపోయాడు. చివరి బంతికి సింగల్ తీయగానే డగౌట్ సీట్ నుంచి ఒక్కసారిగా లేచి గట్టిగ అరిచాడు. ఆపై లక్నో ఆటగాళ్లతో కలిసి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తుంది. బెంగళూరు ఫాన్స్ గంభీర్ పై మండిపడుతున్నారు.
Also Read: Pragya Jaiswal Hot Pics: ప్రగ్యా జైస్వాల్ సోకుల సునామీ.. హాట్ స్టిల్స్ మాములుగా లేవుగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.