GT Vs SRH IPL Match Live Updates: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఐడెన్ మార్క్‌రమ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. హైదరాబాద్ తుది జట్టులో ఒక మార్పు చేయగా.. గుజరాత్ టైటాన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గ్లెన్ ఫిలిప్స్‌ను పక్కనబెట్టి.. మార్కో జాన్సెన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ తుది జట్టులోకి తీసుకుంది. ఈ మ్యాచ్‌ను గుజరాత్ గెలిస్తే అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో చేరుకోవడమే కాదు.. టాప్‌-2 ప్లేస్‌ను కూడా కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఈ మ్యాచ్ ఓడితే హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్యా సేన సరికొత్త జెర్సీలో మైదానంలోకి దిగింది. ప్రస్తుతం గుజరాత్ కొత్త జెర్సీ క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. కొత్త జెర్సీపై టాస్ సమయంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా  మాట్లాడుతూ.. క్యాన్సర్‌ రోగులను ఆదుకునేందుకు ఇది తమ ప్రత్యేక ప్రచారమని తెలిపారు. 'క్యాన్సర్ పేషెంట్లను ఆదుకోవడానికి మేము ఈ కొత్త జెర్సీని ధరించి మైదానంలోకి అడుగుపెడుతున్నాం. ఇది మాకు చాలా ప్రత్యేకం..' అని పాండ్యా వెల్లడించాడు. లావెండర్ రంగు జెర్సీలో గుజరాత్ ఆటగాళ్లు నేడు మ్యాచ్ ఆడుతున్నారు. క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి ఉంది. లావెండర్ సాధారణంగా అన్నవాహిక క్యాన్సర్‌కు రంగు. కానీ ఇప్పుడు ఇది అన్ని రకాల క్యాన్సర్‌లకు ఉపయోగిస్తున్నారు. 


లావెండర్ జెర్సీని ధరించి గతంలో ఢిల్లీ డేర్‌డేవిల్స్ జట్టు కూడా ఆడింది. 2015 సీజన్‌లో మాజీ భారత స్టార్‌ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నేతృత్వంలో ఈ జెర్సీలో మ్యాచ్‌ ఆడింది. స్వయంగా క్యాన్సర్‌ను జయించిన యువరాజ్ సింగ్ చొరవతో ఢిల్లీ జట్టు లావెండర్ జెర్సీ ధరించి క్యాన్సర్‌పై ప్రచారం నిర్వహించింది. లీగ్ దశలో హోమ్‌ గ్రౌండ్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న గుజరాత్ టైటాన్స్.. సరికొత్త జెర్సీలో మెరిసింది.


ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ టైటాన్స్.. 8 విజయాలు, 16 పాయింట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉంది. అయితే హార్దిక్ సేనకు ఇంకా ప్లేఆఫ్ టిక్కెట్ కన్ఫర్మ్ కాలేదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది. అటు 11 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 8 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండోస్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ ఆశలు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌ గెలిచినా.. చాలా సమీకరణాలు ఎస్‌ఆర్‌హెచ్‌కు అనుకూలంగా రావాల్సి ఉంటుంది.


Also Read: IPL 2023 Points Table: రేసులో దూసుకువచ్చిన ఆర్‌సీబీ.. ఆ జట్టు మాత్రం ఔట్  


Also Read: Kadapa Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి