SRH Batter Harry Brook hits 100 Just 55 Balls Vs KKR in IPL 2023: ఐపీఎల్ 2023లో భాగంగా ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అద్భుత విజయం సాధించింది. 23 పరుగుల తేడాతో కోల్‌కతాను చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్‌ (100 నాటౌట్‌; 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీ బాదాడు. అనంతరం లక్ష్య ఛేదనలో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 రన్స్ చేసింది. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (75; 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), రింకూ సింగ్‌ (58 నాటౌట్‌; 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ 2023లో ఆడిన గత మూడు మ్యాచుల్లో హ్యారీ బ్రూక్ దారుణ ప్రదర్శన చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారీ ఫాట్లు ఆడిన బ్రూక్.. బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మిడిల్ ఓవర్లలో కాస్త వేగం తగ్గినా.. మళ్లీ చెలరేగాడు. వరుసగా బౌండరీలు బాదుతూ సన్‌రైజర్స్ స్కోరును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే 55 బంతుల్లో సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో తనపై వచ్చిన విమర్శలకు చెక్ పెట్టాడు. అనేకాదు రూ .13 కోట్లు పెట్టి కొన్నందుకు న్యాయం చేశాడురా అని అభిమానులు మాట్లాడుకునేలా చేశాడు. ప్రస్తుతం బ్రూక్ ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 


ఈ శతకంతో ఐపీఎల్‌ 16వ సీజన్‌లో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా హ్యారీ బ్రూక్‌ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన ఐదో ఇంగ్లండ్ బ్యాటర్‌గా (కెవిన్ పీటర్సన్, బెన్ స్టోక్స్, జోస్‌ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో) రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్‌లో సెంచరీ చేసిన మూడో సన్‌రైజర్స్ బ్యాటర్‌గా కూడా నిలిచాడు. ఈ జాబితాలో డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో ముందున్నారు. ఇక ప్రస్తుతం ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరఫున సెంచరీలు చేసిన బ్యాటర్లు లేరు. 


సొంత మైదానంలో కాకూండా బయట స్టేడియంలో సెంచరీ సాధించిన తొలి ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడిగా హ్యారీ బ్రూక్‌ చరిత్ర సృష్టించాడు. డేవిడ్ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో సెంచరీలు చేసినా... వారు హైదరాబాద్‌లోనే మూడంకెల స్కోర్ అందుకున్నారు. బ్రూక్ మాత్రం కోల్‌కతా సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో సెంచరీ బాదాడు. ఇది అతడికి తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం.


Also Read: CAPF Constable Exam: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో సీఏపీఎఫ్‌ పరీక్ష!  


Aslo Read: Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.