Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!

Maruti Fronx Not Have These 5 Features. టాటా నెక్సాన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు మారుతి సుజుకి ఫ్రాంక్స్‌లో లేవు. ఫ్రాంక్స్‌లో లేని 5 ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.  

Written by - P Sampath Kumar | Last Updated : Apr 14, 2023, 08:16 PM IST
Tata Nexon Vs Maruti Fronx: టాటా నెక్సాన్‌లో ఉన్న ఈ 5 ఫీచర్లు మారుతి ఫ్రాంక్స్‌లో లేవు.. కొనేప్పుడు ఇవి చూసుకోండి!

Maruti Fronx Does Not Have These 5 Features compare with Tata Nexon: మారుతీ సుజుకీ తన కొత్త క్రాసోవర్ ఫ్రాంక్స్‌ని పరిచయం చేసింది. ఏప్రిల్ నెలలో ఫ్రాంక్స్‌ని కంపెనీ ప్రారంభించాల్సి ఉంది. ఈ కారు విడుదల అయిన తర్వాత ఒక వైపు సబ్-4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్, మరోవైపు మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌పై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అయితే టాటా నెక్సాన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు ఇందులో లేవు. ఫ్రాంక్స్‌లో లేని 5 ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

Multi-Drive Modes:
టాటా నెక్సాన్ 3 డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది (ఎకో, సిటీ మరియు స్పోర్ట్). ఇవి మీ డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 1 డ్రైవ్ మోడ్‌ను మాత్రమే కలిగి ఉంటుంది.

Ventilated Seats:
మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫ్రంట్ సీట్ వెంటిలేషన్ మరియు లెథెరెట్ అప్హోల్స్టరీ రెండింటినీ కలిగి ఉండదు. లెథెరెట్ సీట్లు టాటా నెక్సాన్ చాలా వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. కజిరంగా ఎడిషన్‌లో వెంటిలేటెడ్ సీట్లు కూడా ఉన్నాయి.

Tyre Pressure Monitoring System (TPMS):
టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) అనేది చాలా ముఖ్యమైన భద్రతా లక్షణం. ఈ రోజుల్లో చాలా కార్లలో ఇది కనిపిస్తుంది. టీపీఎంఎస్ నెక్సాన్ కార్లలో వస్తుంది. కానీ ఈ ఫీచర్ మారుతి ఫ్రాంక్స్‌లో అందుబాటులో లేదు.

Automatic Wipers:
ఫ్రాంక్స్‌ ఫ్రంట్‌లో ఆటోమేటిక్ LED హెడ్‌ లైట్‌లను పొందుతాయి. కానీ ఆటోమేటిక్ లేదా రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు లేవు. అయితే టాటా నెక్సాన్ యొక్క XMS వేరియంట్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు మరియు వైపర్‌లను కలిగి ఉంది.

Sunroof:
టాటా నెక్సాన్ XMS వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంటుంది. అయితే మారుతి ఫ్రాంక్స్ యొక్క టాప్-ఎండ్ వేరియంట్ కూడా సన్‌రూఫ్‌ను కలిగి లేదు. ఈ రోజుల్లో కార్లలో సన్‌రూఫ్‌లకు చాలా డిమాండ్ ఉంది.

Also Read: OPPO A1 5G Price: ఒప్పో నుంచి సూపర్ 5జీ స్మార్ట్‌ఫోన్.. ధర తక్కువ, ఫీచర్‌లు ఎక్కువ! డిజైన్‌కు ఫిదా అవ్వాల్సిందే   

Also Read: BR Ambedkar Statue: ఎవరో అడిగితే హైదరాబాద్‌ నడిబొడ్డున అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయలేదు: సీఎం కేసీఆర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News