IPL 2023 RCB vs CSK Playing 11: ఐపీఎల్ 2023లో ఇవాళే చెన్నై సూపర్‌కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే
IPL 2023 RCB vs CSK Playing 11: ఐపీఎల్ 2023లో ఇవాళ మరో ఆసక్తికర పోరు జరగనుంది. చెన్నై వర్సెస్ బెంగళూరు తలపడనున్నాయి. బెంగళూరు చిన్నస్వామి స్డేడియంలో ధోని, కోహ్లీ జట్ల మద్య మ్యాచ్ ఆసక్తి రేపనుంది.
IPL 2023 RCB vs CSK Playing 11: రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో ఓటమి పాలైన చెన్నై సూపర్‌కింగ్స్ ఈసారి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించేందుకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో ఏ జట్టు పరిస్థితి ఎలా ఉంది, రెండు జట్ల బలాబలాలేంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో వివరాలు తెలుసుకుందాం..
రాజస్థాన్ రాయల్స్‌పై ఓటమితో చెన్నై సూపర్‌కింగ్స్ కసితో ఉంటే..ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుమీద ఉంది. ఇవాళ బెంగళూరు వేదికగా జరగనున్న ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును ఇంకా గాయాల బెడద పీడిస్తోంది. దీపక్ చాహర్, బెన్ స్టోక్స్ గాయాలతో తుది జట్టుకు దూరమయ్యారు. కెప్టెన్ ధోని సైతం మోకాలి గాయంతో ఉండటంతో ఎంతవరకూ ఆడతాడనేది సందేహంగా మారింది. ఇదే జరిగితే సీఎస్కేకు ఇది చాలా పెద్ద షాక్. ధోనీ ఆడకుంటే అంబటి రాయుడు కీపింగ్ చేసే పరిస్థితి ఉంది.
చెన్నై సూపర్‌కింగ్స్ , ఆర్సీబీ రెండు జట్లు ఈ సీజన్‌లో నాలుగేసి మ్యాచ్‌లు ఆడాయి. రెండింట్లో విజయం సాధించగా మరో రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలయ్యాయి. పాయింట్ల పరంగా రెండు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమంగా ఉన్నాయ..రన్‌రేట్ పరంగా చూస్తే సీఎస్కే పైచేయి సాధించింది. మొత్తం పది జట్లలో రాజస్థాన్ రాయల్స్ 5 మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయం చేజిక్కించుకుని 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ , గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్‌లు ఆడి చెరో మూడు మ్యాచ్‌లలో విజయంతో ఆరేసి పాయింట్లు సాధించాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11
విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వేన్ పార్నెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వైషాక్ విజయ్ కుమార్, మొహమ్మద్ సిరాజ్
చెన్నై సూపర్‌కింగ్స్ ప్లేయింగ్ 11
డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, మిచెల్ శాంట్నర్, మహేశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే
Also read: IPL 2023 GT vs RR: రెచ్చిపోయిన సంజూ-హెట్ మేయర్, గుజరాత్ టైటాన్స్ మరో ఓటమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook