IPL 2023 GT vs RR: ఐపీఎల్ 2023 గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఓ దశలో ఓటమి ఖాయమనుకున్న రాజస్థాన్ చివరి ఓవర్లలో విరుచుకుపడటంతో హార్దిక్ సేనకు మరో ఓటమి తప్పలేదు. సంజూ శామ్సన్, హెట్ మేయర్ హిట్టింగ్ ముందు గుజరాత్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్‌లో మిశ్రమంగా రాణించింది. ఓ దశలో కట్టడి చేసి రెండవ దశలో చేతులెత్తేసింది. చివర్లో తిరిగి కట్టడి చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి గుజరాత్ టైటాన్స్ జట్టు 177 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా మొదటి ఓవర్లోనే వెనుదిరిగాడు. ఆ తరువాత సుదర్శన్ రనౌట్ అయ్యాడు. శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యాలు మూడవ వికెట్‌కు 59 పరుగులు జత చేసి ధాటిగా ఆడటంతో స్కోర్ ముందుకు కదిలింది. హార్దిక్ పాండ్యా తరువాత డేవిడ్ మిల్లర్ అదే స్థాయిలో హిట్టింగ్ చేయడంతో  గుజరాత్ టైటాన్స్ 177 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 


179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ ఇద్దరూ తొలి రెండు ఓవర్లలోనే వెనుదిరిగారు. ఆ తరువాత పడిక్కల్, కెప్టెన్ సంజూ శామ్సన్ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ తరువాత పడిక్కల్ అవుట్ అవడం, తరువాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా వెంటనే వెనుదిరగడంతో 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఓ దశలో 11 ఓవర్లు ముగిసేసరికి కేవలం 62 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక గుజరాత్ విజయం ఖాయమనుకున్న దశలో..సంజూ శామ్సన్, హెట్ మేయర్ గేర్ మార్చేశారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. 


ఆఖరి 5 ఓవర్లలో అంటే కేవలం 30 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హెట్ మేయర్ అదే దూకుడు కొనసాగించాడు. సంజూ అవుట్ కావడంతో అతని స్థానంలో వచ్చిన ధ్రువ్ జురెల్, తరువాత వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ హెట్ మేయర్‌కు చేయూతగా నిలిచారు. చివరి ఓవర్‌లో విజయానికి 7 పరుగులు అవసరమయ్యాయి. హెట్ మేయర్ భారీ సిక్సర్‌తో రాజస్థాన్ రాయల్స్‌కు విజయాన్ని అందించాడు. సంజూ శామ్సన్ 32 బంతుల్లో 60 పరుగులు చేయగా, హెట్ మేయర్ 26 బంతుల్లో 56 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు.


Also read: Virat Kohli Vs Sourav Ganguly: సౌరవ్ గంగూలీకి మరోసారి ఇచ్చిపారేసిన కోహ్లీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Faceboo