Ajinkya Rahane Comments His Position: ఐపీఎల్ 2023 నేటి నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య తొలి పోరు జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతున్న గుజరాత్ మరోసారి టైటిల్‌పై కన్నేసింది. ఆడిన ప్రతిసారి ప్లే ఆఫ్స్‌కు చేరిన చెన్నై జట్టు.. తొలిసారి గతేడాది గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌.. తమ కెప్టెన్ ఎంఎస్ ధోనికి టైటిల్‌ గిఫ్ట్‌గా ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలకాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య ఆసక్తికరంగా పోరు మొదలుకానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ మ్యాచ్‌కు ముందు రెండు జట్ల ప్లేయింగ్ 11పై చర్చ జరుగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే ఓ సీక్రెట్ బయటపెట్టాడు.  పొట్టి ఫార్మాట్‌లో తాను ఓపెనింగ్ చేసేందుకు ఇష్టపడతానని.. అయితే జట్టు తనకు ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ప్రస్తుతం చెన్నై జట్టుకు రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే వంటి ఎస్టాబ్లిష్డ్ ఓపెనర్లు ఉన్న విషయం తెలిసిందే. 


రహానె పాత్ర గురించి ప్రశ్నించగా.. 'నేను ఎప్పుడూ ఓపెనర్‌నే. నేనెప్పుడూ టీ20 ఫార్మాట్‌లోనే ఇన్నింగ్స్‌ను ఓపెనింగ్‌ చేశా. నా పాత్రలో పెద్దగా తేడా లేదు. అయినా మేనేజ్‌మెంట్, కెప్టెన్ నన్ను ఏది చేయమని అడిగినా చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. నాకు అవకాశం దొరికిన ప్రతిసారి నా బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తా..'అంటూ చెప్పుకొచ్చాడు. 


టీమిండియాలో స్థానం కోల్పోయిన అజింక్యా రహానే ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. రంజీ మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. ముంబై తరఫున ఏడు రంజీ మ్యాచ్‌ల్లో 634 పరుగులు చేశాడు. ప్రస్తుతం తాను బ్యాటింగ్ లయను అందుకున్నానని.. జట్టులో అవకాశం దొరికినప్పుడల్లా తన వంతు సహకారం అందించాలనుకుంటున్నానని చెప్పాడు రహానే. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడేందుకు ఎంతో ఉత్సాహంతో ఉన్నట్లు తెలిపాడు. కెప్టెన్‌తో ధోనితో తన అనుభవం చాలా బాగుందన్నాడు. తామిద్దరం చాలా కాలం క్రితమే కలిసి ఆడామని గుర్తు చేసుకున్నాడు. సీఎస్‌కే కుటుంబంలో భాగమైనందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. మహి భాయ్ కెప్టెన్సీలో భారత జట్టులో చాలా సంవత్సరాలు ఆడానని.. ఇది తనకు మరింతగా నేర్చుకునే అవకాశం అని పేర్కొన్నాడు. సీఎస్‌కేలో జట్టులో తొలిసారి ఆడుతున్న రహనే.. తాను ఓపెనర్ అంటూ కొత్త చర్చకు తెరలేపాడు. 


Also Read: IPL Updates: ఫుల్ కిక్కే కిక్.. క్రికెట్ పండుగకు వేళయా.. నేడే ఐపీఎల్ ప్రారంభం  


Also Read: Sunrisers Hyderabad: తొలి మ్యాచ్‌కు ముందు మార్పు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి