Mark Wood Missed IPL 2023: ప్లే ఆఫ్‌కు చేరువ అవుతున్న సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్, పేసర్ జయదేవ్ ఉనద్కత సీజన్‌ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ముఖ్యంగా కేఎల్ రాహుల్ తప్పుకోవడం బ్యాటింగ్‌ విభాగంలో బలహీనపడింది. కెప్టెన్సీలో రాహుల్ లేని లోటు స్పష్టంగా కనబడుతోంది. తాజాగా ఇప్పుడు లక్నోకు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్నో సూపర్ జెయింట్స్ తమ ట్విట్టర్‌లో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మార్క్ వుడ్ మాట్లాడుతూ.. తాను దేశానికి వెళ్లిపోతున్నట్లు చెబుతున్నాడు. మార్క్ వుడ్ తండ్రి కాబోతున్నాడు. ఈ సమయంలో తన భార్య సాహాతో ఎక్కువ సమయం గడిపేందుకు స్వదేశానికి పయనమయ్యాడు. 'నేను నా కుమార్తె పుట్టడం కోసం ఇంటికి తిరిగి వెళ్తున్నాను. నేను జట్టు నుంచి తప్పుకుంటున్నందుకు క్షమించండి. నేను కానీ ఇంటికి వెళ్లడానికి మంచి కారణం ఉంది. మళ్లీ లక్నో జట్టుతో మీరు నన్ను త్వరగా చూస్తారని ఆశిస్తున్నాను. నేను ఆడిన మ్యాచ్‌లలో పెద్దగా సాధించలేకపోయాను. నేను కొన్ని వికెట్లు తీశాను. కానీ త్వరలో జట్టుకు మరింతగా సేవలు అందిస్తా..' అని మార్క్ వుడ్ తెలిపాడు.


లక్నో జట్టు ప్రస్తుతం చాలా బలంగా ఉందని.. జట్టుతో గడిపిన సమయం ఎంతో ఆస్వాదించానని ఈ ఇంగ్లాండ్ స్టార్ పేసర్ తెలిపాడు. సహాయక సిబ్బంది చాలా బాగా సహకరించారని చెప్పాడు. తోటి ఆటగాళ్లు వివిధ రంగాలలో ఎదగడం తనకు చాలా ఇష్టమన్నాడు. తమకు జట్టుకు మరిన్ని విజయాలు అవసరం అని తనకు తెలుసన్నాడు. తమ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందని.. ఆ తరువాత ఫైనల్స్‌కు కూడా చేరుకోవాలని ఆకాంక్షించాడు. గెలుపొటములు సహాజం అని.. కానీ తమ జట్టు ఆటగాళ్లు చాలా కష్టపడుతున్నారని చెప్పాడు. 


లక్నో జట్టు తరుఫున ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన మార్క్ వుడ్.. 11 వికెట్లు తీశాడు. తన తొలి మ్యాచ్‌లో  14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. గత మ్యాచ్‌లో మార్క్ వుడ్‌కు తుది జట్టులో స్థానం లభించలేదు. ఇక లక్నో విషయానికి వస్తే.. 11 మ్యాచ్‌ల్లో ఐదింటిలో గెలుపొంది.. ఐదింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దు అయింది. ప్రస్తుతం 11 పాయింట్లతో టేబుల్‌లో మూడోస్థానంలో ఉంది. ప్లే ఆఫ్‌కు చేరుకోవాలని మిగిలిన మూడు మ్యాచ్‌లు తప్పక నెగ్గాల్సి ఉంటుంది. రెండింటిలో గెలిస్తే.. ఇతర జట్ల సమీకరణాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. 


Also Read: KKR Vs PBKS Deam11 Prediction 2023: కేకేఆర్ ఓడితే ఇంటికే.. నేడు పంజాబ్‌తో ఢీ.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..  


Also Read: Mutual Fund Calculator: రోజుకు రూ.500 ఇన్వెస్ట్ చేయండి.. కోటీశ్వరులు అవ్వండి ఇలా.. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి