LSG vs MI Highlights: చివరి ఓవర్లో మోసిన్ అద్భుత బౌలింగ్.. ముంబయిపై లక్నో విజయం..
LSG vs MI: ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పగ గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో అద్భుతం చేసింది. ఉత్కంఠ పోరులో ముంబయిపై గెలిచింది. చివరి ఓవర్ లో మోసిన్ ఖాన్ అద్భుత బౌలింగ్ చేసి జట్టుకు విజయాన్ని కట్టబెట్టాడు.
IPL 2023, LSG vs MI Highlights: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో అదరగొట్టింది. చివరి ఓవర్ లో మోసిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ చేసి లక్నోకు ఊహించని విజయాన్ని అందించాడు. దీంతో లక్నో 5 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. 13 మ్యాచ్‌ల్లో లక్నోకి ఇది ఏడో గెలుపు.
తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో ఇన్నింగ్స్ ను నత్తనడకన ప్రారంభించింది. ఓపెనర్లు దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్ తక్కువ స్కోర్లుకే వెనుదిరిగారు వీరిద్దరినీ బెరెన్‌డార్ఫ్ ఔట్ చేశాడు. డికాక్ కూడా స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అనంతరం కెప్టెన్ కృనాల్‌తో కలిసి స్టాయినిస్ జట్టును ఆదుకున్నాడు. స్టాయినిస్ (89 నాటౌట్; 47 బంతుల్లో 4×4, 8×6), కృనాల్ పాండ్య (49 రిటైర్డ్ హర్ట్; 42 బంతుల్లో 1×4, 1×6)ల పోరాటంతో లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 177 పరుగులు చేసింది.
అనంతరం ఛేదన ప్రారంభించిన ముంబయి ప్లేయర్లు మెుదట్లో చెలరేగి ఆడారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. మరోవైపు రోహిత్ కూడా భారీ షాట్లు కొట్టడంతో ముంబయి స్కోరు బోర్డు పరుగులెత్తింది. పవర్ ప్లే ముగిసేసరికి ముంబయి 58/0తో నిలిచింది. అయితే స్పిన్నర్ రవి బిష్ణోయ్ రాకతో ముంబయి కథ మారింది.అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇద్దరినీ ఔట్ చేసి.. ముంబయిపై ఒత్తిడి పెంచాడు. వరుసగా సూర్య, వధేరా వికెట్లు కోల్పోయిన ముంబై కష్టాల్లో పడింది.
చివరి 20 బంతుల్లో 45 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ టైంలో డేవిడ్ అద్భుతమైన షాట్లు కొట్టి..మ్యాచ్ ను చివరి వరకు తీసుకొచ్చాడు. చివరి ఓవర్లో జట్టు విజయానికి 11 పరుగులే అవసరమయ్యాయి. ఇక ముంబయి విజయం లాంఛనమే అనుకున్నారు అందరు. ఆఖరి ఓవర్ వేయడానికి వచ్చిన మోసిన్ ఒత్తిడిలో కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. కేవలం 5 పరుగులే ఇచ్చి జట్టుకు విజయాన్ని అందించాడు.
Also Read: IPL 2023 Centuries: ఈ సీజన్‌లో సెంచరీ వీరులు వీళ్లే.. అత్యధిక స్కోరు ఎంతంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.