IPL 2023 Playoffs Race: ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్.. మిగతా మూడు జట్లు ఇవేనా!
IPL 2023 Playoffs Qualification Chances For All Teams. ఎల్ 2023 పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఖాతాలో 18 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరగా.. మిగిలిన మూడు స్థానాల కోసం చాలా టీమ్స్ పోటీలో నిలిచాయి.
IPL 2023 Playoffs Qualification Scenarios For All Teams: భారత గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ 2023లో లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు చేరుకున్నాయి. చాలా జట్లు ప్లేఆఫ్స్ వెళ్లేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇక నుంచి ప్రతి మ్యాచూ, పాయింటూ కీలకమవడంతో విజయాలపైనే దృష్టి సారిస్తున్నాయి. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ చేరింది. ఐపీఎల్ 2023 పాయింట్స్ పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ ఖాతాలో 18 పాయింట్స్ ఉన్నాయి. గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ చేరగా.. మిగిలిన మూడు స్థానాల కోసం చాలా టీమ్స్ పోటీలో నిలిచాయి. ప్లేఆఫ్స్ చేరే అవకాశమున్న జట్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
గుజరాత్ టైటాన్స్:
పది జట్లు ఆడుతున్న ఐపీఎల్ 2023లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ప్లేఆఫ్స్ చేరుకుంటాయన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తొలి రెండు స్థానాలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఓడిన జట్టుకు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అందులకే ప్లేఆఫ్స్‌లో నిలిచే జట్లు టాప్ 2లో నిలిచేందుకు చూస్తాయి. ఇక 16వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న గుజరాత్ టైటాన్స్.. ప్లేఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. గుజరాత్ జట్టుకు ఇంకో మ్యాచ్ ఉంది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి టాప్-1లో కొనసాగాలని చూస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్:
చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల ప్రస్తుతం ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కోల్‌కతాపై ఓడిపోవడంతో చెన్నైపై ప్రభావం చూపింది. పాయింట్ల పట్టికలో టాప్ 2 స్థానాల్లో నిలిచే అవకాశాలు తగ్గాయి. చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే.. ప్లేఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఓడితే ముంబై, లక్నో, బెంగళూరుతో పోటీ ఉంటుంది.
ముంబై ఇండియన్స్:
పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. మిలిగిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్తును దక్కించుకుంటుంది. రెండూ ఓడిపోతే మాత్రం ప్లేఆఫ్స్ వెళ్లడం కష్టమే అవుతుంది. ఒక్క మ్యాచ్ గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది.
లక్నో సూపర్ జెయింట్స్:
లక్నో సూపర్ జెయింట్స్ 13 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన రెండింటిలో గెలిస్తే 17 పాయింట్లతో ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఓడిపోతే ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. లక్నో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. ఆర్‌ఆర్, కేకేఆర్‌లు ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలుగుతాయి.
హైదరాబాద్, ఢిల్లీ ఔట్:
బెంగళూరు రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే14 పాయింట్లతో ఇతర జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. 12 పాయింట్లతో ఉన్న పంజాబ్ రెండు మ్యాచ్‌ల్లో గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక రాజస్థాన్, కోల్‌కతా మిగిలిన మ్యాచులో గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, ఢిల్లీ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నాయి.
Also Read: Bhuvneshwar-Gill Record: ఐపీఎల్ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించిన భువనేశ్వర్, గిల్!
Also Read: సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం.. Nveda Joint Support పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.