IPL Playoff Qualification Scenarios: ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌లో మూడు బెర్త్‌లు కన్ఫార్మ్ అయిపోయాయి. గుజరాత్ ఇప్పటికే టాప్ పోజిషన్‌లో ఉండగా.. శనివారం ఢిల్లీపై విజయంతో చెన్నై.. కోల్‌కతాపై గెలుపుతో లక్నో జట్లు చెరో 17 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరిపోయాయి. మిగిలిన ఒక బెర్త్‌ కోసం రేసులో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఉన్నాయి. రాజస్థాన్ లీగ్ మ్యాచ్‌లు అన్ని ఆడేసింది. ప్రస్తుతం ముంబై, ఆర్‌సీబీ జట్ల ఓటమి కోసం ఎదురుచూస్తోంది. వీటిలో బెంగుళూరు ఎక్కువ భారీ తేడాతో ఓడిపోవాలని రాజస్థాన్ కోరుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో 14 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ముంబై ఇండియన్స్ కూడా 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడం ముంబై, బెంగళూరు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.


ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తలపడనున్నాయి. హైదరాబాద్‌పై ముంబై గెలిస్తే రాజస్థాన్ టోర్నీ నుంచి తప్పుకుంటుంది. గుజరాత్ చేతిలో ఆర్‌సీబీ కూడా ఓడిపోతే ముంబై ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ముంబై భారీ తేడాతో గెలిచి.. గుజరాత్‌ను ఆర్‌సీబీ కూడా ఓడిస్తే.. అప్పుడు నెట్‌రేట్‌ కీలకం అవుతుంది. అప్పుడు బెంగుళూరుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముంబై, ఆర్‌సీబీ జట్లు ఓడిపోతేనే రాజస్థాన్‌కు అవకాశాలు ఉంటాయి.


పాయింట్ల పట్టికలో టాప్-2 బెర్త్‌లను గుజరాత్, చెన్నై ఫిక్స్ చేసుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫైయర్-1 పోరు జరగనుంది. ఇక్కడ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో లక్నో టీమ్ ఎలిమినేటర్-1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన జట్టుతో ఫైనల్ బెర్త్ కోసం పోటీపడుతుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే.. ఫైనల్‌కు చేరుకుంటుంది. 


కోల్‌కతా నైట్‌రైడర్స్ 14 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో 7వ స్థానంతో సరిపెట్టుకుంది. చివరి రెండు మ్యాచ్‌లను ఓడి చేజేతులా ప్లేఆఫ్స్‌ అవకాశాలను చేజార్చుకుంది పంజాబ్ కింగ్స్. 14 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో 8వ స్థానంతో టోర్నీని ముగించింది. ఆఖరి రెండుస్థానాలకు ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య పోటీ నెలకొంది. ఢిల్లీ 5 విజయాలు 10 పాయింట్లతో తొమ్మిదోస్థానంలో ఉంది. నేడు ముంబైను ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ తేడాతో ఓడిస్తే.. 9వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది.


Also Read: RBI New Guidelines On Rs 2000 Notes: సెప్టెంబర్ 30 వరకు 100 రోజులు.. బ్యాంకులో మొత్తం ఎంత మార్చుకునే ఛాన్స్.. దీని వెనుకున్న మ్యాథ్స్ ఏంటో తెలుసా ?


Also Read: Aadhaar Card Updates: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమైందో లేదో ఎలా తెలుసుకోవడం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి