IPL 2023 Updates: టైటిల్ వేటకు లక్నో సూపర్ జెయింట్స్ రెడీ.. ఆశలన్నీ వారిపైనే..!
Lucknow Super Giants: బరిలోకి దిగిన మొదటి సీజన్‌లోనే లక్నో సూపర్ జెయింట్స్ అదగొట్టింది. కేఎల్ రాహుల్ నాయకత్వంలో స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు చేరింది. ఈసారి ఫైనల్‌కు చేరడంతో పాటు కప్ గెలవాలనే కసితో రెడీ అవుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు.
Lucknow Super Giants Best playing XI IPL 2023: క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న పండుగ అతి త్వరలోనే ప్రారంభంకానుంది. మార్చి 31 నుంచి 10 జట్ల మధ్య టైటిల్ వేట మొదలుకానుంది. ఈసారి అన్ని జట్లు హాట్ ఫేవరేట్లుగా కనిపిస్తున్నా.. కొందరు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమవ్వడం కాస్త దెబ్బతీసింది. అయినా అన్ని జట్లు స్టార్ ప్లేయర్లతో టోర్నీలోకి బరిలోకి దిగుతున్నాయి. గతేడాది టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్.. తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శన కనబర్చింది. కేఎల్ రాహుల్ తన నాయకత్వ పటిమతో జట్టును టాప్-4లో నిలిపాడు. ఈ ఏడాది కూడా మంచి ప్రదర్శనతో టైటిల్ ఒడిసి పట్టేయాలని చూస్తోంది. ఆ జట్టు బలబలాలను ఓసారి పరిశీలిస్తే..
లక్నోను కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ వంటి ప్రపంచస్థాయి ఓపెనర్లు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరు క్రీజ్‌లో నిలబడినా ప్రత్యర్థి జట్టుకు కష్టాలే. క్షణాల్లో మ్యాచ్‌ను మార్చేయగలరు. దీపక్ హుడా, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్ వంటి హార్డ్ హిట్టర్లు జట్టులో ఉన్నారు. ముఖ్యంగా నికోలస్ పూరన్‌ను వేలంలో రూ.16 వేల కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఈ స్టార్ ప్లేయర్‌పై భారీ అంచనాలే పెట్టుకుంది. ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్యా, కైల్ మేయర్స్, మార్కస్ స్టొయినిస్‌తో మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో అవేశ్ ఖాన్, మొహ్సిన్ ఖాన్, డేనియల్ సామ్స్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్, కరణ్ శర్మ వంటి ప్లేయర్లతో ప్రత్యర్థులకు సవాల్ విసరనుంది. ఇంగ్లాండ్ స్పీడ్ బౌలర్ మార్క్ వుడ్ గాయం కారణంగా దూరమవ్వడం ఆ జట్టుకు మైనస్ అని చెప్పొచ్చు. ఇది మినహా పెద్దగా లోపాలు లేవు.
లక్నో సూపర్ జెయింట్స్ తొలి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఏప్రిల్ 1న తలపడనుంది. ఆ తరువాత లక్నో రెండో మ్యాచ్ చెన్నైతో ఏప్రిల్ 3న పోటీ పడనుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.. ఈ మ్యాచ్ మే 20న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. గత సీజన్‌లో లీగ్ దశలో లక్నో 14 మ్యాచ్‌ల్లో 9 గెలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఈసారి ఫైనల్ చేరటడంతో పాటు టైటిల్ గెలవాలని చూస్తోంది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అవేశ్ ఖాన్, ఆయుష్ బడోని, కృష్ణప్ప గౌతమ్, ప్రేరక్ మన్కడ్, కైల్ మేయర్స్, అమిత్ మిశ్రా, మొహ్సిన్ ఖాన్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, డేనియల్ సామ్స్, కరణ్ శర్మ, రొమారియో షెపర్డ్, మార్కస్ స్టొయినిస్, స్వప్నిల్ సింగ్, జయదేవ్ ఉనద్కత్, మనన్ వోహ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్.
Also Read: Financial Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు.. ఆలోపు ఈ పనులు పూర్తి చేయండి
Also Read: MLA Undavalli Sridevi: జగన్ దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయింది.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి