MI vs GT Dream11 Team Prediction: గుజరాత్‌పై ముంబై ప్రతీకారం తీర్చుకుంటుందా..? పిచ్ రిపోర్ట్.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..!
Mumbai Indians Vs Gujarat Titans Dream11 Team Prediction Today: ఐపీఎల్లో నేడు రెండు పెద్ద జట్ల మధ్య బిగ్‌ఫైట్ జరగనుంది. తన మాజీ జట్టు ముంబైపై హర్ధిక్ పాండ్యా ప్రతాపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ముంబై, గుజరాత్ జట్ల మధ్య హైస్కోరింగ్ గేమ్ జరిగే అవకాశం ఉంది.
Mumbai Indians Vs Gujarat Titans Dream11 Team Prediction Today: ఐపీఎల్ తుది దశకు చేరుకుంటోంది. ఐపీఎల్ బెర్త్‌లు కన్పార్మ్ చేసుకునేందుకు అన్ని జట్లు శ్రమిస్తున్నాయి. నేడు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు జరగనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్ దాదాపు ఖరారు చేసుకున్న గుజరాత్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేస్ ఫిక్స్ చేసుకుంటుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లో గుజరాత్ 8 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. అటు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో విన్ అయితే.. ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరగవుతాయి. ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉంది. శుక్రవారం రాత్రి ముంబై సొంత మైదానం వాంఖడే స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్.. హెడ్ టు హెడ్ రికార్డులు.. ప్లేయింగ్ 11.. డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
పిచ్ రిపోర్ట్ ఇలా..
ముంబై వాంఖడే స్టేడియ పిచ్ ఎక్కువగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అవుట్‌ఫీల్డ్ వేగంగా ఉండడంతో బ్యాట్స్‌మెన్లు పండగ చేసుకుంటారు. మరోసారి బౌండరీల వరదపారే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ బౌలర్లకు కూడా ఆరంభంలో మంచి సహకారం లభిస్తుంది. ఈ మ్యాచ్ కూడా హైస్కోరింగ్ గేమ్‌గా జరిగే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన జట్లు ముందుగా బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపుతాయి. హెడ్ టు హెడ్ రికార్డులు పరిశీలిస్తే.. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరగ్గా.. చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. తొలి మ్యాచ్ బ్రబౌర్న్ స్టేడియంలో జరగ్గా.. ముంబై విజయం సాధించింది. ఈ సీజన్‌లో అహ్మదాబాద్‌లో రెండో మ్యాచ్ జరగ్గా.. గుజరాత్ జట్టు గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముంబై సొంత మ్యాచ్‌లో జరగనుండడంతో ఆ జట్టుకు ప్లస్ కానుండగా.. గుజరాత్ టైటాన్స్ జట్టు ఎలా ఆడుతుందో చూడాలి.
రెండు జట్ల ప్లేయింగ్ 11 ఇలా.. (అంచనా)
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహల్ వధేరా, కెమెరూన్ గ్రీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మాండ్వాల్, క్రిస్ జోర్డాన్.
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్.
డ్రీమ్ 11 టీమ్ టిప్స్ ఇలా..
వికెట్ కీపర్లు: వృద్ధిమాన్ సాహా, ఇషాన్ కిషన్ (కెప్టెన్)
బ్యాట్స్‌మెన్లు: శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, నేహల్ వధేరా, డేవిడ్ మిల్లర్
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), కెమెరూన్ గ్రీన్
బౌలర్లు: రషీద్ ఖాన్, పీయూష్ చావ్లా, మహ్మద్ షమీ
Also Read: Indian Railway Facts: ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా అన్ని సౌకర్యాలు ఉంటాయా..? ఈ విషయాలు తెలుసుకోండి
Also Read: Rain Alert for AP: ఏపీ ప్రజలకు చల్లని కబురు.. వచ్చే మూడు రోజుల్లో వర్షాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి