Punjab Kings Vs Delhi Capitals Indians Dream11 Team Prediction Today: ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ రేసుకు 8 జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ప్లేస్ ఫిక్స్ చేసుకోగా.. మిగిలిన మూడు స్థానాలకు 7 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ 8వ స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్ ఆశలు సజీవంగా ఉంటాయి. మరోవైపు ఢిల్లీ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఢిల్లీకి ఈ మ్యాచ్‌ ఓడినా.. గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ధర్మశాలలో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బుధవారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పిచ్ రిపోర్ట్.. తుది జట్లు, డ్రీమ్ 11 టీమ్ టిప్స్ మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్‌పై మంచి బౌన్స్ ఉంటుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా బ్యాట్‌పైకి బంతి వస్తుంది. పిచ్ సాధారణంగా స్ట్రోక్ ప్లేకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ అవుట్‌ఫీల్డ్ సాధారణంగా వేగంగా ఉంటుంది. దీంతో బౌండరీల వరద పారే అవకాశం ఉంటుంది. మ్యాచ్‌ సాగుతున్న పిచ్‌లో  గ్రిప్, టర్న్‌ను లభించే అవకాశం ఉండడంతో స్పిన్నర్లకు కొంత సహాయం లభిస్తుంది. మరోసారి హైస్కోరింగ్ గేమ్‌గా సాగే అవకాశం ఉంటుంది. పిచ్ బ్యాటింగ్ సహకరిస్తుండడంతో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.
 
తుది జట్లు ఇలా.. (అంచనా)


పంజాబ్ కింగ్స్: శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), అథర్వ తైదే, సామ్‌ కర్రాన్‌, సికందర్‌ రజా, షారూఖ్‌ ఖాన్‌, హర్‌ప్రీత్‌ బ్రార్‌, రాహుల్‌ చాహర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.


ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), మిచెల్ మార్ష్, రిలే రోసో, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబే, మనీష్ పాండే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్.


డ్రీమ్ 11 టీమ్ ఇలా..


వికెట్ కీపర్: ఫిలిప్ సాల్ట్, ప్రభ్‌సిమ్రాన్‌ సింగ్‌
బ్యాట్స్‌మెన్లు: శిఖర్‌ ధావన్‌ (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, రిలే రోసో 
ఆల్‌రౌండర్లు: లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మిచెల్ మార్ష్ (కెప్టెన్), అక్షర్ పటేల్, సామ్ కర్రన్ 


బౌలర్లు: ఇషాంత్ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌


Also Read: Bhuma Akhila Priya Reddy Arrest: టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్ట్  


Also Read: Pawan Kalyan: 'పాపం పసివాడు..' అంటూ సీఎం జగన్‌కు పవన్ కళ్యాణ్ కౌంటర్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి