Will Jacks Ruled Out Of IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ప్రారంభానికి ముందు కీలక ఆటగాళ్లు గాయాల నుంచి దూరమవుతున్నారు. తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్స్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కు దూరమయ్యాడు. కండరాల గాయం కారణంగా విల్ జాక్స్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.3.2 కోట్లకు దక్కించుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బంగ్లాదేశ్ పర్యటనలో రెండో వన్డేలో విల్ జాక్స్  గాయపడ్డాడు. దీంతో ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లిపోయాడు. జాక్స్‌కు టీ20 ఫార్మాట్‌లో మంచి రికార్డు ఉంది. 109 మ్యాచ్‌ల్లో ఆడిన 29.80 సగటుతో 2802 పరుగులు చేశాడు. విల్ జాక్స్ ప్లేస్‌లో న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్‌ను ఆర్‌సీబీ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. వేలంలో బ్రేస్‌వెల్ రూ.కోటి ప్రాథమిక ధర కాగా.. అతన్ని కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపించేదు. మార్చి 31 నుంచి ఐపీఎల్ మొదలుకానుండగా.. ఏప్రిల్ 2న ముంబై ఇండియన్స్‌తో ఆర్‌సీబీ తలపడనుంది.


ఇటీవల కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టుకు కూడా షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఆ జట్టు సారథి శ్రేయాస్ అయ్యర్ కూడా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆసీస్‌తో నాలుగో టెస్టులో వెన్నునొప్పి కారణంగా అయ్యర్ మధ్యలోనే తప్పుకున్నాడు. ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరమవుతుండడం ఐపీఎల్‌ కళ తప్పే అవకాశం ఉంది.  
 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు: విరాట్ కోహ్లీ, డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్, డేవిడ్ విల్లీ, మహిపాల్ లోమోర్, ఫిన్ అలెన్, సిద్ధార్థ్ కౌల్, కర్ణ్ శర్మ, సుయాస్ ప్రభూదేస్ పటీదార్, ఆకాష్దీప్, రీస్ టోప్లీ, రంజన్ కుమార్, అవినాష్ సింగ్, హిమాన్షు శర్మ, మనోజ్ భాండాగే, సోనూ యాదవ్.


Also Read: IRCTC: ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. కేవలం రూ.10 వేలతో ఈ ఐదు ఆలయాలను సందర్శించండి


Also Read: Rishabh Pant: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్.. పంత్ లేటెస్ట్ వీడియో చూశారా..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి