Reliance Jio Cinema is likely to start charges after IPL 2023: ప్రస్తుతం ఎవరి మొబైల్‌లో చూసినా.. 'జియో సినిమా' ఆప్ ఉంది. ఇందుకు కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌). క్యాష్ రిచ్ లీగ్  మ్యాచ్‌ల ప్రసారాలతో జియో సినిమా బాగా పాపులర్ అయింది. ఆనతి కాలంలోనే ప్రజాదరణ పొందింది. దాంతో జియో సినిమాను అతిపెద్ద స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌గా మార్చేందుకు రిలయన్స్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే 100కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లను జియో సినిమా యాప్‌లో ఉంచనుంది. దాంతో నెట్‌ఫ్లిక్స్‌, వాల్ట్‌ డిస్నీ వంటి స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడేందుకు రిలయన్స్‌ ప్లాన్ చేసింది. అయితే వినియోగదారులకు షాక్ ఇచ్చింది. కంటెంట్‌కు ఇకపై డబ్బులు వసూలు చేయనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత టీ20 టోర్నీ ఐపీఎల్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను వయాకామ్‌ 18 దక్కించుకున్న విషయం తెలిసిందే. జియో సినిమా యాప్‌ ద్వారా ఉచితంగా ఐపీఎల్‌ ప్రసారాలను వయాకామ్‌ 18 అందిస్తోంది. జియో మాత్రమే కాకుండా అన్ని టెలికాం నెట్‌వర్క్‌ వినియోగదారులకూ ఉచితంగా సేవలు లభిస్తుండడంతో.. మండే వేసవిలో క్రికెట్ ఫాన్స్ ఎంచక్కా ఐపీఎల్ మ్యాచులను ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ఐపీఎల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వ్యూస్‌ వస్తున్నాయి. కొన్ని మ్యాచులు అయితే పాత రికార్డులను తిరగరాస్తున్నాయి. 


ఐపీఎల్‌ 2023 ద్వారా వచ్చిన ఆదరణను కొనసాగించడం కోసం 'జియో సినిమా'లో కొత్తగా కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని రిలయన్స్‌ మీడియా, కంటెంట్‌ బిజినెస్‌ ప్రెసిడెంట్‌ జ్యోతి దేశ్‌పాండే ఓ ప్రకటనలో తెలిపారు. కంటెంట్‌ యాడ్‌ అయ్యాక ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ఎంత వసూలు చేయాలనేది ఇంకా నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లు మే 28తో ముగుస్తాయి. ఆ సమయం లోగా కొత్త కంటెంట్‌ను యాడ్‌ చేయాలని రిలయన్స్‌ భావిస్తోందని జ్యోతి దేశ్‌ పాండే చెప్పుకొచ్చారు. 


Also Read: Harry Brook Century: చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ చరిత్రలో 'ఒకే ఒక్కడు'!  


ఐపీఎల్‌ 2023 మ్యాచ్‌లను మాత్రం ఉచితంగా వీక్షించొచ్చని జ్యోతి దేశ్‌ పాండే చెప్పారు. ఇక జియో సినిమాకు వసూలు చేసే డబ్బులు సామాన్యులకు కూడా అందుబాటు ధరలోనే ఉంచాలని తాము భావిస్తున్నట్లు తెలిపారు. దేశీయ కంటెంట్‌ను కూడా అందించాలని చూస్తున్నామని పేర్కొన్నారు. ఐపీఎల్‌ ప్రారంభమైన తొలి వారంలోనే జియో సినిమా 5.5 బిలియన్‌ యునిక్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఏప్రిల్‌ 12న జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 22 మిలియన్ల మంది వీక్షించారు. 


Also Read: CAPF Constable Exam: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో సీఏపీఎఫ్‌ పరీక్ష!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.