Pornstar Kendra Lust praises KKR batter Rinku batting: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బ్యాటర్ రింకు సింగ్‌ ఓవర్ నైట్ స్టార్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏ క్రికెట్ అభిమాని నోట విన్నా.. రింకు సింగ్‌, రింకు సింగ్‌ అని అంటున్నారు. ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో ఏకంగా ఐదు సిక్స్‌లు బాది హీరో అయిపోయాడు. చివరి ఓవర్లో కోల్‌కతా విజయానికి 28 పరుగులు అవసరం కాగా.. అందరూ ఓటమి తప్పదు అనుకున్నారు. అయితే రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. కోల్‌కతాకు ఊహించని విజయాన్ని అందించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్ చూసిన వాళ్లందరూ రింకూ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. క్రికెట్ దిగ్గజాలు కూడా రింకూని ఆకాశానికి ఎత్తేశారు. ఇక కొందరు అయితే రింకుకు పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు. ఈ జాబితాలో అమెరికా పోర్న్‌స్టార్ 'కెంద్రా లస్ట్' కూడా చేరిపోయారు. రింకూ ఇన్నింగ్స్ చూసిన కెంద్రా లస్ట్.. అతడి ఆటకు ఫిదా అయ్యారు. 'రింకూ ది కింగ్' అని పోస్టు పెట్టారు. అంతేకాదు ముద్దు పెడుతున్న, ఫైర్ ఎమోజీలని షేర్ చేశారు. కేకేఆర్ లోగో బ్యాక్‌గ్రౌండ్‌లో రింకూ, తనూ ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


దేశవాళీలో మంచి ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దృష్టిని రింకూ సింగ్‌ ఆకర్షించాడు. 2018 ఐపీఎల్‌ వేలంలో రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే అవకాశాలు రాక, వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో అతడి పేరు పెద్దగా వినిపించలేదు. అయితే రింకూపై నమ్మకం ఉంచిన కోల్‌కతా.. జట్టులో కొనసాగించింది. కేకేఆర్‌ అకాడమీలో బ్యాటింగ్‌ మెరుగుపర్చుకున్నాడు. 2021లో మోకాలి శస్త్రచికిత్స కారణంగా ఆ ఏడాది ఆడలేదు. ఇక ఐపీఎల్ 2023 కోసం కొత్తగా సిద్ధమై అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. రింకూ ఐపీఎల్‌లో 20 మ్యాచ్‌ల్లో 349 పరుగులు చేశాడు.


[[{"fid":"269020","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


అలీగఢ్‌కు చెందిన పేద కుటుంబం నుంచి రింకు సింగ్ వచ్చాడు. తండ్రి ఖాన్‌ చంద్‌ ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేసేవాడు. కుటుంబ సమస్యల కారణంగా పెద్దగా చదువుకోని రింకూ.. క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. అయితే బంతి కూడా కొనలేని పరిస్థితి మనోడిది. క్రికెట్ అంటే రింకూ తండ్రికి ఇష్టం లేదు. తనకు సాయం చేయకుండా.. ఆట ఆడుతున్నాడనే కోపంతో రింకును కొట్టేవాడు. అయినా అతను క్రికెట్‌ను వదల్లేదు. ఓ వైపు తండ్రికి సాయంగా సిలిండర్లు డెలివరీ చేస్తూనే.. మరోవైపు తల్లి ప్రోత్సాహంతో క్రికెట్ ఆడాడు. ఓ టోర్నీలో రింకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచి మోటార్‌ సైకిల్‌ గెలుచుకున్నాడు. ఆ బైక్ తన తండ్రికి బహుమతిగా ఇచ్చాడు. దాంతో రింకులోని ప్రతిభను గుర్తించిన తండ్రి ప్రోత్సహించడం మొదలెట్టాడు.


Also Read: Vivo Y100A Price 2023: వివో నుంచి అందమైన స్మార్ట్‌ఫోన్.. డిజైన్, ఫీచర్లు సూపరో సూపర్! ధర కూడా తక్కువే  


యూపీ అండర్‌-16 జట్టు ట్రయల్స్‌లో రింకు సింగ్ రెండుసార్లు విఫలమైనా నిరాశపడలేదు. పట్టు వదలకుండా ఆడాడు. 2012లో విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ అరంగేట్రంలోనే 154 పరుగులు చేశాడు. కొద్ది నెలల్లోనే యూపీ అండర్‌-19 జట్టుకు ఎంపికయ్యాడు. అనంతరం సీనియర్‌ జట్టులోనూ అదరగొట్టాడు. దేశవాళీలో మంచి ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ దృష్టిలో పడ్డాడు. దాంతో 2018 ఐపీఎల్‌ వేలంలో రింకూని రూ. 80 లక్షలకు కొనుగోలు చేసింది.


Also Read: Gautam Gambhir Angry Video: లక్నో థ్రిల్లింగ్ విక్టరీ.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ గంభీర్‌! వైరల్ వీడియో  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.