KKR Vs RR Dream11: ఈడెన్‌లో కింగ్ ఎవరు? డ్రీమ్11 ప్రిడిక్షన్ టిప్స్, పిచ్ రిపోర్ట్ వివరాలు ఇవే!
KKR Vs RR Dream11 Team Prediction: ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, రాజస్థాన్ తలపడనున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌కు సంబంధించిన డ్రీమ్ 11 టీమ్ వివరాలు, ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
KKR Vs RR Dream11 Team Prediction: ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ నడుస్తోంది. ఈ రోజు ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఓ వైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమి నుంచి కోలుకుని వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ సీజన్‌లో రెండు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓటమి పాలయ్యాయి. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లు జరగబోయే మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్‌లో ఏ జట్టు విజయకేతనం ఎగురవేస్తుందో చూడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన స్టేడియం పిచ్ రిపోర్ట్, డ్రీమ్ 11 టీమ్ వివరాలు ఇవే..
ఈడెన్ గార్డెన్స్ పిచ్ రిపోర్ట్:
ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ స్కోర్ పొందడానికి టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవడం చాలా మంచిది. ఈ పిచ్‌లో బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ గెలుస్తూ వస్తోంది.
కోల్‌కతా, రాజస్థాన్ మ్యాచ్ సంబంధించిన మ్యాచ్ వివరాలు:
వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
సమయం: మే 11, సాయంత్రం 7: 30
డ్రీమ్11 ప్రిడిక్షన్:
వికెట్ కీపర్లు: రహ్మానుల్లా గుర్బాజ్, జోస్ బట్లర్, సంజు శాంసన్
బ్యాటర్లు: రింకూ సింగ్, జేసన్ రాయ్, యశస్వి జైస్వాల్
ఆల్ రౌండర్లు: ఆండ్రీ రస్సెల్, రవిచంద్రన్ అశ్విన్
బౌలర్లు: వరుణ్ చక్రవర్తి, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్
కెప్టెన్: జోస్ బట్లర్
వైస్ కెప్టెన్: ఆండ్రీ రస్సెల్
ప్లేయింగ్ 11 టీమ్స్:
కోల్‌కతా నైట్ రైడర్స్:
జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.
రాజస్థాన్ రాయల్స్:
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (c, wk), జో రూట్, దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, ఆర్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook