LKN vs SRH Live Score Updates: రాహుల్, కృనాల్ సూపర్ షో.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం! సన్‌రైజర్స్ రెండో ఓటమి

Fri, 07 Apr 2023-11:01 pm,

LKN vs SRH IPL 2023 10th Match Live Score Updates. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. లైవ్ అప్ డేట్స్ మీ కోసం.

LKN vs SRH IPL 2023 10th Match Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, సన్‌‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ 2023లో లక్నో మూడో మ్యాచ్ ఆడుతుండగా.. సన్‌రైజర్స్‌ రెండో మ్యాచ్ ఆడుతోంది. లక్నో, హైదరాబాద్ జట్లు తమ చివరి మ్యాచ్‌లలో ఓటమిని ఎదుర్కొన్నాయి. దాంతో ఈ మ్యాచులో గెలవాలని బరిలోకి దిగాయి. రెండు జట్లలో స్టార్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇక లక్నో మెగా టోర్నీలో శుభారంభం చేయగా.. హైదరాబాద్ ఇంకా ఖాతా తెరవలేదు. 

Latest Updates

  • సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఘన విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్ధేశించిన 122 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16 ఓవర్లలో 127 రన్స్ చేసింది. నాలుగు పరుగులు అవసరమైన సమయంలో టీ నటరాజన్‌ వేసిన 16వ ఓవర్‌లో ఐదు బంతులకు మూడు సింగిల్స్‌ వచ్చాయి. చివరి బంతిని నికోలస్ పూరన్ (11 నాటౌట్) సిక్స్‌ బాది గెలిపించాడు. కేఎల్ రాహుల్ (35), కృనాల్ పాండ్యా (34) టాప్ స్కోరర్లు. 

  • 15 ఓవర్ పూర్తయ్యేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్ 118/5. పూరన్ (5), స్టోయినిస్  (9) వచ్చారు. ఇక 4 పరుగులు చేస్తే లక్నో విన్ అవుతుంది. 
     

  • 13వ ఓవర్ పూర్తయ్యేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ మూడు వికెట్స్ కోల్పోయి 109 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (34), మార్కస్ స్టోయినిస్ (4) ఉన్నారు.
     

  • 11 ఓవర్లు: లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్ 91/2. క్రీజులో కేఎల్ రాహుల్ (31), కృనాల్ పాండ్యా (28) ఉన్నారు. ఈ ఓవర్లో ఉమ్రాన్ మాలిక్  9 రన్స్ ఇచ్చాడు. 
     

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగిశాయి. లక్నో స్కోర్ 82/2. కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్యా (23) క్రీజులో ఉన్నారు. 
     

  • 9 ఓవర్లు: లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్ 72/2. క్రీజులో కేఎల్ రాహుల్ (30), కృనాల్ పాండ్యా (15) ఉన్నారు. ఈ ఓవర్లో ఆదిల్ రషీద్ 9 రన్స్ ఇచ్చాడు. 
     

  • అదిల్ రషిద్‌ వేసిన 7వ ఓవర్లో లక్నో 10 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (27), కృనాల్‌ పాండ్య (1) క్రీజులో ఉన్నారు. 
     

  • దీపక్ హుడాను (7) భువనేశ్వర్‌ అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్‌కు చేర్చాడు. సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ పట్టి ఆహా అనిపించాడు.
     

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే ఓవర్లు ముగిశాయి. లక్నో స్కోర్ 45/2. కేఎల్ రాహుల్ (18), కృనాల్ పాండ్యా (0) క్రీజులో ఉన్నారు. 
     

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ మొదటి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న కేల్‌ మేయర్స్‌ (13) ఔటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌ ఫరూఖి బౌలింగ్‌లో (4.3వ ఓవర్‌) బౌండరీ లైన్‌ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • 3 ఓవర్లు: లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్ 29-0. క్రీజులో కేఎల్ రాహుల్ (12), కైల్ మేయర్స్ (12) ఉన్నారు. ఈ ఓవర్లో ఫజల్హక్ ఫారూఖీ 5 రన్స్ ఇచ్చాడు. 
     

  • 2వ ఓవర్ పూర్తయ్యేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్ కోల్పోకుండా 24 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (11), కైల్ మేయర్స్ (8) ఉన్నారు.
     

  • 1 ఓవర్ పూర్తయ్యేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్కోర్ 13/0.  కేఎల్ రాహుల్ (5), కైల్ మేయర్స్ (3) వచ్చారు. 
     

  • లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటింగ్ మొదలైంది. ఓపెనర్లుగా కెఎల్ రాహుల్, కైల్ మేయర్స్ వచ్చారు. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 121 రన్స్ చేసింది. రాహుల్ త్రిపాఠి (35) టాప్ స్కోరర్. అన్మోల్‌ప్రీత్ సింగ్ (31), అబ్దుల్ సమద్ (21) కీలక పరుగులు చేశారు. టాప్ బ్యాటర్లు మయాంక్ అగర్వాల్ (8), ఐడెన్‌ మార్‌క్రామ్‌ (0), హ్యారీ బ్రూక్ (3) నిరాశపరిచారు. లక్నో బ్యాటర్లలో మూడు వికెట్స్ పడగొట్టగా.. అమిత్ మిశ్రా రెండు వికెట్స్ పడగొట్టాడు. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస వికెట్స్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (16), రాహుల్ త్రిపాఠి (35), ఆదిల్ రషీద్ (4) పెవిలియన్ చేరారు. 19 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోర్ 108/7. 
     

  • రాహుల్‌ త్రిపాఠి (35) ఔట్ అయ్యాడు. యశ్‌ ఠాకూర్ బౌలింగ్‌లో లెప్టెడ్  షాట్‌ ఆడేందుకు యత్నించి అమిత్ మిశ్రాకు చిక్కాడు. 18 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోర్ 102-5. 
     

  • 17 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాలుగు వికెట్ల నష్టానికి 92 రన్స్ చేసింది. వాషింగ్టన్ సుందర్ (14), రాహుల్ త్రిపాఠి (33) క్రీజులో ఉన్నారు. 
     

  • 15 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్కోర్ 83-4. వాషింగ్టన్ సుందర్ (11), రాహుల్ త్రిపాఠి (28) క్రీజులో ఉన్నారు. ఈ ఓవర్లో అమిత్ మిశ్రా 7 రన్స్ ఇచ్చాడు. 
     

  • 14వ ఓవర్ పూర్తయ్యేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాలుగు వికెట్స్ కోల్పోయి 74 పరుగులు చేసింది. క్రీజులో వాషింగ్టన్ సుందర్ (9), రాహుల్ త్రిపాఠి (23) ఉన్నారు.
     

  • పరుగుల కోసం సన్‌రైజర్స్‌ బ్యాటర్లు తంటాలు పడుతున్నారు. 13 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోరు 72-4కి చేరింది. 
     

  • 12 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నాలుగు వికెట్ల నష్టానికి 69 రన్స్ చేసింది. వాషింగ్టన్ సుందర్ (5), రాహుల్ త్రిపాఠి (21) క్రీజులో ఉన్నారు. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. సన్‌రైజర్స్‌ స్కోర్ 63/4. వాషింగ్టన్ సుందర్ (2), రాహుల్ త్రిపాఠి (18) క్రీజులో ఉన్నారు. ఇక ఆశలు అన్ని రాహుల్ మీదే ఉన్నాయి. 
     

  • 9 ఓవర్లు: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్కోర్ 55-4. క్రీజులో రాహుల్ త్రిపాఠి (12), వాషింగ్టన్ సుందర్ (0) ఉన్నారు. ఈ ఓవర్లో రవి బిష్ణోయ్ ఒక వికెట్ తీసి 5 రన్స్ ఇచ్చాడు. 
     

  • హ్యారీ బ్రూక్ స్టంప్డ్ ఔట్ అయ్యాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్లో ముందుకు వచ్చి షాట్ ఆడగా.. కీపర్ వికెట్లను గిరాటేశాడు. 

  • ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌ స్కోరు 50-3. క్రీజ్‌లో హ్యారీ బ్రూక్‌, రాహుల్ త్రిపాఠి ఉన్నారు.

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ (31) ఎల్బీ కాగా.. కెప్టెన్‌ ఎయిడెన్ మార్క్‌రమ్ (0) గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వరుస బంతుల్లో కృనాల్ పాండ్యా ఈ ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో పవర్ ప్లే పూర్తయింది. వికెట్ కోల్పోయి 43 రన్స్ చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ (27), రాహుల్ త్రిపాఠి (7) క్రీజులో ఉన్నారు. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రివ్యూ సక్సెస్ అయింది. అన్మోల్‌ప్రీత్ సింగ్‌ను ఎల్బీగా ఔట్ ప్రకటించగా.. అతడు రివ్యూ తీసుకుని సక్సెస్ అయ్యాడు. యశ్ ఠాకూర్ వేసిన బంతి వికెట్ల మీది నుంచి వెళ్ళింది. 

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు ముగిశాయి. కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 9 రన్స్ వచ్చాయి. అన్మోల్‌ప్రీత్ సింగ్ (22), రాహుల్ త్రిపాఠి (2) క్రీజులో ఉన్నారు. ప్రస్తుత సన్‌రైజర్స్‌ స్కోరు 33/1. 
     

  • 4 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఒక వికెట్ నష్టానికి 23 రన్స్ చేసింది. అన్మోల్‌ప్రీత్ సింగ్ (14), రాహుల్ త్రిపాఠి (1) క్రీజులో ఉన్నారు. 
     

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మొదటి వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ (8) ఔటయ్యాడు. కృనాల్ పాండ్యా వేసిన 3వ ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. 
     

  • 2 ఓవర్లు: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్కోర్ 15/0. క్రీజులో మయాంక్ అగర్వాల్ (3), అన్మోల్‌ప్రీత్ సింగ్ (12) ఉన్నారు. ఈ ఓవర్లో జయదేవ్ ఉనద్కత్ 10 రన్స్ ఇచ్చాడు. 
     

  • మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్ కోల్పోకుండా 5 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ (2), అన్మోల్‌ప్రీత్ సింగ్ (3) క్రీజులో ఉన్నారు. 

  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటింగ్ ఆరంభం అయింది. మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్ ఓపెనర్లుగా వచ్చారు. 

  • ఈ మ్యాచ్ కోసం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు మార్పులు చేశాడు. అవేశ్ ఖాన్, మార్క్ వుడ్ మ్యాచ్ ఆడడం లేదు. అమిత్ మిశ్రా, రొమారియో షెపర్డ్ జట్టులోకి వచ్చారు. 

  • ఐపీఎల్ 2023లో రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓడిపోయింది. దాంతో బోణీ కొట్టాలని ఆరేంజ్ ఆర్మీ చూస్తోంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ ఐడెన్‌ మార్‌క్రామ్‌ అందుబాటులోకి రావడంతో హైదరాబాద్‌ రాత మారుతుందని ఫాన్స్ భావిస్తున్నారు. 

  • తుది జట్లు:
    సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అన్మోల్‌ప్రీత్ సింగ్ (కీపర్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్‌రమ్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఆదిల్ రషీద్. 
    లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, రవి బిష్ణోయ్. 
     

  • ఈ మ్యాచులో సన్‌‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link