MI vs CSK IPL 2023 Live Score Updates: ఐపీఎల్ 2023లో చెన్నైకి రెండో విజయం.. ముంబైకి రెండో ఓటమి!

Sat, 08 Apr 2023-11:01 pm,

MI vs CSK IPL 2023 12th Match Live Streaming and Live Score Updates. ఐపీఎల్ 2023లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. లైవ్ అప్ డేట్స్ మీ కోసం.

Mumbai Indians vs Chennai Super Kings IPL 2023 12th Match Live Score Updates: ఐపీఎల్ 2023లో భాగంగా నేడు మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (MI Vs CSK Live) తలడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఓడిన ముంబై.. సొంత మైదానంలో సత్తాచాటాలని చూస్తోంది. ఇక  గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిన చెన్నై.. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచింది. మెగా టోర్నీలో రెండో విజయం కోసం ధోనీ సేన కన్నేసింది. రెండు జట్లు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ (MI Vs CSK IPL 2023 Live Streaming) రసవత్తతంగా సాగే అవకాశం ఉంది. 

Latest Updates

  • ఐపీఎల్‌ 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. 158 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అజింక్య రహానే (61) హాఫ్ సెంచరీ చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ (40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (32) టాప్ స్కోరర్. 
     

  • 18వ ఓవర్ పూర్తయ్యేసరికి చెన్నై 3 వికెట్స్ కోల్పోయి 153 పరుగులు చేసింది. అంబటి రాయుడు (16), రుతురాజ్‌ గైక్వాడ్ (40) పరుగులతో క్రీజులో ఉన్నారు.
     

  • 16 ఓవర్లకు చెన్నై స్కోరు 135/3. అంబటి రాయుడు (2), రుతురాజ్‌ (37) పరుగులతో ఉన్నారు. చెన్నై విజయానికి ఇంకా 23 రన్స్ అవసరం. 
     

  • చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడో వికెట్ కోల్పోయింది. శివమ్‌ దూబే (28) ఔట్ అయ్యాడు. 15 ఓవర్లకు స్కోరు 135/3.
     

  • 14 ఓవర్లకు స్కోరు 125/2. రుతురాజ్‌ గైక్వాడ్ (29), శివమ్‌ దూబే (28) పరుగులతో ఉన్నారు. 
     

  • 12వ ఓవర్ పూర్తయ్యేసరికి చెన్నై 2 వికెట్స్ కోల్పోయి 108 పరుగులు చేసింది. శివమ్ దూబే (18), రుతురాజ్ గైక్వాడ్ (22) క్రీజులో ఉన్నారు. 
     

  • చెన్నై ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగిశాయి. చావ్లా వేసిన ఈ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. శివమ్ దూబే (9), రుతురాజ్ గైక్వాడ్ (20) క్రీజులో ఉన్నారు.
     

  • హాఫ్ సెంచరీ చేసి జోరుమీదున్న అజింక్య రహానే ఔటయ్యాడు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడి లాంగ్‌ఆన్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు చిక్కాడు. 8 ఓవర్లకు చెన్నై స్కోర్ 82-2. 
     

  • Fastest IPL fifties against MI:
    14 - Pat Cummins (KKR), 2022
    18 - Rishabh Pant (DC), 2019
    19 - Ajinkya Rahane (CSK), 2023 

  • Fastest IPL fifties for CSK:
    16 - Suresh Raina vs PBKS, 2014
    19 - Ajinkya Rahane vs MI, 2023
    19 - Moeen Ali vs RR, 2022
    20 - MS Dhoni vs MI, 2012
    20 - Ambati Rayudu vs MI, 2022

  • ఆరు ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి 68 పరుగులు చేసింది. అజింక్య రహానే (53), రుతురాజ్ గైక్వాడ్ (8) క్రీజులో ఉన్నారు. 
     

  • చెన్నై బ్యాటర్ అజింక్య రహానే చెలరేగాడు. సిక్సులు, ఫోర్లతో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. జింక్స్ 6 ఫోర్లు, 3 సిక్సులతో అర్ధ శతకం చేశాడు. 
     

  • 5 ఓవర్లు: చెన్నై స్కోర్ 55/1. అజింక్య రహానే (44), రుతురాజ్ గైక్వాడ్ (4) క్రీజులో ఉన్నారు. 
     

  • చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అజింక్యా రహానే 36 పరుగులు (14 బంతుల్లో) రెచ్చిపోయి ఆడుతున్నాడు. తొలి 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ జట్టు స్కోర్ 44/1 చేరుకుంది. అవసరమైన రన్ రేట్ 7.13 ఉండగా.. ప్రస్తుత రన్ రేట్ 10.08 గా ఉంది.

  • ఇన్నింగ్స్ ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్

    158 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి 2.4 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 21 పరుగులు చేసింది.

  • ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 రన్స్ చేసింది. దాంతో చెన్నై ముందు 158 పరుగుల లక్ష్యం ఉంది. ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ (32) టాప్ స్కోరర్ కాగా.. టీమ్ డేవిడ్ (31) కీలక పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 21 రన్స్ చేయగా.. సూర్యకుమార్ యాదవ్ (1) నిరాశపరిచాడు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్స్ పడగొట్టాడు. 
     

  • 18వ ఓవర్ పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ 8 వికెట్స్ కోల్పోయి 135 పరుగులు చేసింది. క్రీజులో పీయూష్ చావ్లా (2), హృతిక్ షోకీన్ (3) ఉన్నారు. 
     

  • టిమ్‌ డేవిడ్ బతికిపోయాడు. గైక్వాడ్ క్యాచ్ వదిలేయడంతో సిక్స్, ఫోర్, సిక్స్ బాది ముంబై స్కోర్ పెంచే ప్రయత్నం చేశాడు. చివరి బంతికి ఔట్ అయ్యాడు. 17 ఓవర్లకు ముంబై స్కోరు 131/8. 

  • వికెట్లు పడటంతో ముంబై స్కోరు వేగం నెమ్మదించింది. టిమ్‌ డేవిడ్ స్పిన్ ఆడేందుకు కష్టాలు పడుతున్నాడు. 16 ఓవర్లకు స్కోరు 113/7. టిమ్‌ డేవిడ్ (14) క్రీజులో ఉన్నారు.
     

  • 15 ఓవర్లు: ముంబై ఇండియన్స్ స్కోర్ 109/6. టిమ్‌ డేవిడ్‌ (12), ట్రిస్టన్ స్టబ్స్ (3) క్రీజులో ఉన్నారు. 
     

  • ముంబై ఇండియన్స్ ఆరో వికెట్ కోల్పోయింది. తిలక్ వర్మ (21) ఔటయ్యాడు. జడేజా వేసిన 13వ ఓవర్ చివరి బంతికి ఎల్బీ అయ్యాడు. తిలక్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. 13 ఓవర్లకు ముంబై స్కోర్ 102-6. 
     

  • 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ ఐదు వికెట్స్ కోల్పోయి 87 రన్స్ చేసింది. తిలక్ వర్మ (13), టీమ్ డేవిడ్ (4) క్రీజులో ఉన్నారు.  
     

  • ముంబై ఇండియన్స్ జట్టుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అర్షద్ ఖాన్ (2) ఔట్ అయ్యాడు. సాంట్నర్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. దాంతో ముంబై ఐదో వికెట్ కోల్పోయిది. 
     

  • చెన్నై బౌలర్లు జోరు మీదున్నారు. వరుసగా నాలుగో వికెట్ తీశారు. రవీంద్ర జడేజా బౌలంగ్‌లో కెమెరూన్‌ గ్రీన్ (12) అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. జడేజా సూపర్ క్యాచ్ పట్టాడు.

  • ముంబై ఇండియన్స్ మూడో వికెట్ కోల్పోయింది. శాంట్నర్ బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (1) ధోనికి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ధోని డీఆర్ఎస్ కోరాడు. రీప్లైలో సూర్య గ్లౌజ్‌కు తాకినట్లు స్పష్టంగా కనబడింది. దీంతో ముంబై బ్యాటర్ పెవిలియన్ బాటపట్టాడు. సోరుబోర్డు: 8 ఓవర్లకు 73-3.

  • ముంబైకు మరో షాక్ తగిలింది. జోరు మీదున్న ఓపెనర్ ఇషాన్ కిషన్ (32)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. స్కోరు 66-2 (7).

  • పవర్ ప్లే ముగిసే సరికి ముంబై జట్టు వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (31) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
     

  • ఐదో ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. క్రీజ్‌లో ఇషాన్ కిషన్ (18, కెమెరూన్ గ్రీన్ (6) ఉన్నారు. స్కోరు 47-1
     

  • ముంబై ఇండియన్స్ మొదటి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ (21) ఔటయ్యాడు. తుషార్ దేశ్ పాండే వేసిన 4వ ఓవర్ చివరి బంతికి బోల్డ్ అయ్యాడు. 
     

  • 3 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ కోల్పోకుండా 30 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (14), ఇషాన్ కిషన్ (14) క్రీజులో ఉన్నారు. 
     

  • 2 ఓవర్లు: ముంబై ఇండియన్స్ స్కోర్ 16/0. రోహిత్ శర్మ (13), ఇషాన్ కిషన్ (1) క్రీజులో ఉన్నారు. 
     

  • మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ వికెట్ కోల్పోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ శర్మ (9), ఇషాన్ కిషన్ (1) ఉన్నారు. 
     

  • చెన్నై పేసర్ దీపక్ చహర్ ఎడమ కాలుకి గాయం అయింది. ఫిజియో వచ్చి గాయాన్ని పరిశీలిస్తున్నాడు. దాంతో ఆటకు కాసేపు విరామం. చివరి బంతిని చహర్ వేస్తాడో లేదో చూడాలి. 
     

  • ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ మొదలైంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చారు. 
     

  • ముంబై ఇండియన్స్ సబ్స్: రమణదీప్ సింగ్, సందీప్ వారియర్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, నేహాల్ వధేరా. 
    చెన్నై సూపర్ కింగ్స్ సబ్స్: రాజవర్ధన్ హంగర్గేకర్, అంబటి రాయుడు, షేక్ రషీద్, ఆకాష్ సింగ్, సుభ్రాంశు సేనాపతి. 

  • చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు: డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్, కీపర్), శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, దీపక్ చహర్, మిచెల్ సాంట్నర్, సిసంద మగల, తుషార్ దేశ్‌పాండే. 

  • ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, అర్షద్ ఖాన్, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్. 
     

  • ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. బెన్ స్టోక్స్, మొయిన్ అలీ స్థానాల్లో అజింక్య రహానే, ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. 
     

  • ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముంబై ఇండియన్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 
     

  • చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు ముఖాముఖిగా 34 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో ముంబై 20 సార్లు గెలవగా.. చెన్నై 14 మ్యాచుల్లో విజయం సాధించింది.
     

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link