Lucknow Super Giants Vs Mumbai Indians Playing 11 And Toss: ఐపీఎల్‌లో నేడు కీలక సమరానికి సమయం ఆసన్నమైంది. ప్లే ఆఫ్స్‌ బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూజర్ జెయింట్స్ జట్లు అమీతుమి తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువ అవుతుంది. పాయింట్స్‌ టేబుల్‌లో తమ స్థానాలను మెరుగు పరుచుకుంటాయి. లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో సొంతగడ్డపై లక్నో మొదట బ్యాటింగ్ ఆరంభించనుంది. ముంబై ఇండియన్స్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుండగా.. లక్నో తుది జట్టులో మూడు మార్పులు చేసింది. నవీన్, దీపక్ హుడా జట్టులోకి రాగా.. కైల్ మేయర్స్, అవేష్ ఖాన్‌కు విశ్రాంతి ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


 



టాస్ గెలిచిన రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా బౌలింగ్ వైపు మొగ్గుచూపాడు. 'మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ నుంచి ఏమి ఆశించాలో మాకు తెలుసు. ఇది మంచి ట్రాక్‌గా కనిపిస్తోంది. కానీ స్పందిస్తుందో కచ్చితంగా తెలియదు. ముందు తక్కువ స్కోరు ఉంటే మంచిది. మేము ఛేజింగ్ కోసం సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ సీమర్లు కూడా ఇక్కడ చాలా ప్రభావవంతంగా బౌలింగ్ చేస్తారు. మా జట్టులో నలుగురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. ప్రతి గేమ్ ముఖ్యమైనది. ఎవరైనా ఏదో రోజున ఎవరినైనా ఓడించగలరు. మేము తుది జట్టులో ఒక మార్పు చేశాం..' అని హిట్ మ్యాన్ వెల్లడించాడు.


టాస్ ఓడిపోవడమే మంచిది అయింది. మేం టాస్ గెలిచినా.. ముందుగా బ్యాటింగే చేసి ఉండేవాళ్లం. ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌ ముఖ్యమైనదే. అందుకు అనుగుణంగా తుది జట్టులో మార్పులు ఉంటాయి. నవీన్, దీపక్ హుడా జట్టులోకి వచ్చారు. కైల్ మేయర్స్, అవేష్ ఖాన్‌కు విశ్రాంతి ఇచ్చాం. ఇంకో మార్పు కూడా ఉంది. అది గుర్తులేదు. అందరూ ఫిట్‌గా ఉన్నారు..' అని లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా తెలిపారు.  


తుది జట్లు ఇలా..


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండార్ఫ్, ఆకాష్ మధ్వల్


ఇంపాక్ట్ ప్లేయర్లు: రమణదీప్ సింగ్ , విష్ణు వినోద్, ట్రిస్టన్ స్టబ్స్, కుమార్ కార్తికేయ, రాఘవ్ గోయల్


లక్నో సూపర్ జెయింట్స్:  క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్.


ఇంపాక్ట్ ప్లేయర్లు: కైల్ మేయర్స్, యష్ ఠాకూర్, కృష్ణప్ప గౌతం, డేనియల్ సామ్స్, యుధ్వీర్ సింగ్ చరక్


Also Read: LSG Vs MI Dream11 Team Prediction: ముంబై జోరుకు లక్నో బ్రేకులు వేస్తుందా..? ప్లే ఆఫ్స్ చేరేది ఎవరు..? డ్రీమ్ 11 టీమ్ ఇలా..  


Also Read: LSG Vs MI Updates: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్.. తుది జట్టులో కీలక మార్పులు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook