Mumbai Indians Highlights IPL 2023: ఆర్‌సీబీ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోతే.. హా.. ముంబై ఇండియన్స్‌కు ఇది సెంటిమెంట్ అని అన్నారు. చెన్నై చేతిలో రెండో మ్యాచ్‌లో కూడా ఓడిమిపాలైంది. ఈ మ్యాచ్‌ దేవుడికి ఇచ్చాం.. అంటూ ముంబై ఫ్యాన్స్ సర్దుకుంటున్నారు. ముంబై బ్యాటింగ్, బౌలింగ్ ఇలానే ఉంటే అన్ని మ్యాచ్‌లు దేవుడికే ఇవ్వాల్సి వస్తుందంటూ నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేయగా.. చెన్నై సూపర్ కింగ్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఓటమికి కారణాలను ఓసారి పరిశీలిస్తే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జట్టులో స్టార్ ప్లేయర్లు ఉన్నా.. నిలకడలేమి స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కెమెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్ వంటి స్టార్ ప్లేయర్లకు తోడు తిలక్ వర్మ వంటి లోకల్ స్టార్‌తో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్నా ఈ సీజన్‌లో పెద్దగా సెట్ అవ్వలేదనిపిస్తోంది. ముఖ్యంగా హిట్‌మ్యాన్ బ్యాట్‌కు పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఒకటి రెండు మంచి షాట్లు ఆడడం.. కుదురుకుంటున్న సమయంలో నిర్లక్ష్యంగా వికెట్ సమర్పించుకోవడం అలవాటై పోయింది. ఒక మ్యాచ్‌లో మెరిస్తే.. మరో మూడు మ్యాచ్‌ల్లో ఫ్లాప్ అవుతున్నాడు ఇషాన్ కిషన్. వీరిద్దరు గాడినపడితేనే ముంబై జట్టు గట్టేక్కుతుంది. స్టార్‌ ఆల్‌రౌండర్ కెమెరూన్ గ్రీన్‌ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చాల్సి ఉంది. టీ20ల్లో నెంబర్ వన్‌గా బ్యాటర్‌గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది. 


ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన సూర్య.. ఇక్కడ కూడా అలాంటి ఆటతీరునే కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ముంబై ఆశలన్నీ తిలక్ వర్మపైనే ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో పరువు కాపాడిన ఈ తెలుగు ఆటగాడు.. రెండో మ్యాచ్‌లో కాస్త పర్వాలేదనిపించాడు. మున్ముందు బ్యాటింగ్‌లో తిలక్ వర్మ కీలకంగా మారే అవకాశం ఉంది. కీరన్ పొలార్డ్ వంటి స్టార్‌ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ముంబై జట్టుకు సరైన ఫినిషర్ కావాల్సి ఉంది. 


Also Read: Fastest 50 in IPL 2023: ఐపిఎల్ 2023లో ఫాస్టెస్ట్ 50 రికార్డ్ అజింక్య రహానేదే.. ఎన్ని బంతుల్లోనో తెలుసా ?


బౌలింగ్‌ విషయానికి వస్తే.. బుమ్రా దూరమవ్వడం ముంబై జట్టును బాగా దెబ్బ తీస్తోంది. బుమ్రా ప్లేస్‌లో జోఫ్రా అర్చర్ వంటి స్టార్‌ బౌలర్ జట్టులోకి వచ్చినా.. తొలి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. రెండో మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమయ్యాడు. మొదటి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడిన బెహాండ్రఫ్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. రెండో మ్యాచ్‌కు తుది జట్టులోకి వచ్చినా పెద్దగా రాణించలేదు. అర్షద్ ఖాన్ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. పీయూష్ చావ్లా, కార్తీకేయ వంటి స్పిన్నర్లు ఉన్నా.. వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. 


పేపర్‌పై జట్టు బలంగా ఉన్నా.. గ్రౌండ్‌లోకి వచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఓపెనింగ్‌లో మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాలి. మిడిల్ ఆర్డర్‌ కుదురుకోవాలి. ఓపెనర్లు శుభారంభం అందిస్తే.. దాన్ని కంటిన్యూ చేస్తూ భారీ స్కోర్లుగా మలచాలి. అదేవిధంగా మంచి ఫినిషర్‌ను ముంబై జట్టు రెడీ చేసుకోవాలి. హార్ధిక్ పాండ్యా, పొలార్డ్ వంటి ప్లేయర్లు దూరమైన తరువాత సరైన ప్లేయర్ దొరకలేదు. బౌలింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఫస్ట్‌ హాఫ్‌లో ఎక్కువ మ్యాచ్‌లో ఓడిపోయినా.. సెకాండఫ్‌లో పుంజుకుని టైటిల్ గెలిచిన సందర్భాలు ఉండడంతో ముంబై జట్టు పుంజుకుంటుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. 


Also Read: David Warner Not Out: యశస్వి జైశ్వాల్ క్యాచ్ పట్టినా.. డేవిడ్ వార్నర్‌కి ఔట్ ఇవ్వలేదు ఎందుకో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి