MI vs GT, IPL 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ కు ముంబై ఇండియన్స్ కళ్లెం వేసింది. హార్దిక్ సేనపై రోహిత్ సేన 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ తరపున రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ ప్రదర్శన చేసిన.. సూర్య వీరబాదుడు ముందు అదంతా చిన్నబోయింది. తనదైన మార్క్ షాట్లతో చెలరేగి ఆడిన సూర్యభాయ్ తొలి ఐపీఎల్ శతకం నమోదు చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ గెలిచిన టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ  (29), ఇషాన్‌ కిషన్‌ (31) మెరుపు ఆరంభాన్నిచ్చారు. మంచి ఊపుతో బ్యాటింగ్ చేస్తున్న వీరిద్దరినీ ఒకే ఓవర్లు ఔట్ చేసి దెబ్బ కొట్టాడు రషీద్. ఫామ్ లో ఉన్న వధేరాను కూడా అతడే ఔట్ చేశాడు. అప్పటి నుంచే మెుదలైంది సూర్య విధ్వంసం. వచ్చిన బంతిని వచ్చనట్టు బౌండరీకి తరలించాడు. తన 360 డిగ్రీ ఆటతో ముంబయికు ఊహించని స్కోరును అందించాడు. అతడికి విష్ణు వినోద్‌ (30) సహకరించడంతో స్కోరు రెండు వందల మార్కును దాటింది. సూర్యకుమార్ కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 103 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో ముంబై 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. 


అనంతరం ఛేజింగ్ ఆరంభించిన టైటాన్స్ ను ముంబై బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా ఆకాశ్ మధ్వల్, కుమార్ కార్తికేయ,  పియూష్ చావ్లా హార్దిక్ సేనను దెబ్బ తీశారు. సాహా (2), శుభ్‌మన్‌ (6), హార్దిక్‌ (4) సింగిల్ డిజిట్స్ కే పరిమితమయ్యారు. అయితే టైటాన్స్ ఆటగాళ్లలో ఉన్నంతసేపు మిల్లర్‌  (41; 26 బంతుల్లో 4×4, 2×6) మెరుపులు మెరిపించాడు. మరోవైపు బౌలింగ్ లో సత్తా చాటిన రషీద్ ఖాన్ ((79 నాటౌట్‌; 32 బంతుల్లో 3×4, 10×6) బ్యాట్ తోనూ మెరిశాడు. ఓ పక్క వికెట్లు పడుతున్న ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. జోసెఫ్ (7 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్‌కు కేవలం 40 బంతుల్లో 88 పరుగులు జోడించాడు రషీద్. అయితే విజయాన్ని మాత్రం అందించలేకపోయాడు. 


Also Read: Yashasvi Jaiswal IPL 2023 Runs: యశస్వి జైస్వాల్ మెరుపు ఇన్నింగ్స్.. ఆరెంజ్ క్యాప్‌ రేసులోకి యంగ్ ప్లేయర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి