Rohit Sharma Wicket Controversy Video: వరుస ఓటముల తరువాత ముంబై ఇండియన్స్ పుంజుకుంది. పటిష్ట రాజస్థాన్ రాయల్స్‌పై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 7 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ (124, 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లు) శతకంతో కదం తొక్కడంతో ముంబై ముందు భారీ లక్ష్యం విధించింది. అనంతరం ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్ (55, 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), కెమెరూన్ గ్రీన్ (44, 26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా.. ఆఖర్లో టిమ్ డేవిడ్ (45, 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే.. ముంబై విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది నాలుగో విజయం కాగా.. రాజస్థాన్‌కు నాలుగో ఓటమి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్‌లో బర్త్‌ డే బాయ్, ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఔట్ అయిన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే సందీప్ శర్మ బౌలింగ్‌లో  హిట్‌మ్యాన్‌ బౌల్డ్ అయ్యాడు. దీంతో నిరాశతో రోహిత్ వెంటనే మైదానం వీడి వెళ్లిపోయాడు. అయితే రీప్లేలు చూసిన తర్వాత రోహిత్ శర్మ నాటౌట్ అంటూ నెటిజన్లు వీడియోలు వైరల్ చేస్తున్నారు. 


 



వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ చేతిలోకి బాల్ వెళ్లగా.. గ్లవ్స్ బెయిల్స్‌కు తగిలింది. అదే సమయంలో లైట్‌ వెలిగి బెయిల్స్ కిందపడిపోయాయి. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్ కూడా గమనించలేదు. రోహిత్ శర్మ ఔట్ అయిన విధానంపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. తన పుట్టినరోజు నాడు రోహిత్ శర్మ 4 బంతుల్లో 3 పరుగులు చేసి ఔట్ కావడం అభిమానులను నిరాశపర్చింది. ఫీల్డ్ అంపైర్ ఏ మాత్రం పరిశీలించకుండా అంపైర్ వెంటనే వేలు పైకెత్తడంతో రోహిత్ శర్మ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 


అయితే రీప్లేలు చూస్తుంటే.. రోహిత్ నిజంగా ఔట్ అయ్యాడో లేదో చెప్పడం కష్టంగా మారింది. సందీప్ శర్మ వేసిన బంతి స్టంప్‌ను తాకినట్లు అనిపించినా.. అదేసమయంలో సంజూ శాంసన్ గ్లవ్స్ కూడా స్టంప్‌ను తాకాయి. రోహిత్ శర్మ ఔట్ కాలేదని అభిమానులు అంటున్నారు. హిట్‌మ్యాన్‌కు అన్యాయం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. వీడియోను బాగా పరిశీలిస్తే.. రోహిత్ శర్మ ఔట్ కాదని తెలుస్తుందన్నారు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టులేకపోతున్న రోహిత్ శర్మ.. ఇలా అనుమానాస్పద రీతిలో ఔట్ అవ్వడం అభిమానులను బాధిస్తోంది. 


Also Read: Rohit Sharma Birthday: రోహిత్ శర్మ బర్త్‌ డేకు హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్.. 60 అడుగుల భారీ కటౌట్.. కోహ్లీని మించి..!  


Also Read: New Secretariat In Telangana: కొత్త సచివాలయం గుండెకాయ వంటిది.. చెమట చిందించిన ప్రతి శ్రామికుడికీ ధన్యవాదాలు: సీఎం కేసీఆర్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook