ఒకే మైదానంలో అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు.. టాప్‌లో టీమిండియా మాజీ కెప్టెన్! పూర్తి లిస్ట్ ఇదే
RCB vs CSK Match Day, Virat Kohli scores most fifties in T20 matches at a single ground. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే మైదానంలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.
Virat Kohli hits most fifties in T20 matches at a single ground: టీ20 ఫార్మాట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పొట్టి ఫార్మాట్‌లో బ్యాటర్లదే ఎక్కువగా హవా ఉంటుంది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ.. పరుగులు చేస్తుంటారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ, సెంచరీ చేస్తుంటారు. ఇక సొంత మైదానాల్లో అయితే మరింత చెలరేగుతూ పరుగులు చేస్తుంటారు. దాంతో ఎక్కువగా అర్ధ శతకాలు నమోదవు అతుంటాయి. ఒకే మైదానంలో అత్యధిక టీ20 హాఫ్ సెంచరీలు చేసిన జాబితాను ఓసారి చూద్దాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) మాజీ కెప్టెన్, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli).. ఒకే మైదానంలో టీ20 మ్యాచ్‌లలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో (M Chinnaswamy Stadium) కోహ్లీ 25 అర్ధ శతకాలు నమోదు చేశాడు. నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనున్న విరాట్.. ఈ రికార్డును మరింత మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌పై 1,000 ఐపీఎల్ పరుగులు చేయడానికి 21 పరుగుల దూరంలో కోహ్లీ ఉన్నాడు. నేటి మ్యాచ్ (RCB vs CSK) ద్వారా ఈ ఫీట్ కూడా అందుకునే అవకాశం ఉంది.
టీ20 మ్యాచ్‌లలో ఒకే మైదానంలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ వార్నర్ 19 అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ టోర్నీలో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
Also Read: OnePlus 11 5G Price 2023: డెడ్ చీప్‌గా వన్‌ప్లస్ 11 5జీ స్మార్ట్‌ఫోన్.. ఏకంగా 25 వేల డిస్కౌంట్!
నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ టీ20 క్రికెట్‌లో 24 అర్ధ సెంచరీలు చేశాడు. ఇంగ్లండ్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ జాసన్ రాయ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో 21 అర్ధ శతకాలు చేశాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ఢాకా వేదికగా జరిగిన టీ20 క్రికెట్‌లో 21 హాఫ్ సెంచరీలు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.