MS Dhoni Lifts Ravindra Jadeja after CSK beat GT in IPL 2023 Final: ఐపీఎల్ 2023 టైటిల్‌ను లెజెండ్ ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కైవసం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో సోమవారం జరిగిన ఫైనల్లో చెన్నై డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా (15 నాటౌట్; 6 బంతుల్లో ఫోర్, సిక్స్‌) సూపర్ బ్యాటింగ్‌తో అలరించి.. చెన్నైకి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దాంతో మైదానంలో చెన్నై ప్లేయర్స్, అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చెన్నై విజయానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. మోహిత్ శర్మ వేసిన మొదటి బంతికి శివమ్ దూబే సింగిల్ కూడా తీయలేదు. తర్వాతి మూడు బంతులకు మూడు రన్స్ రాగా.. చివరి రెండు బంతులకు 10 పరుగులు చేయాల్సి వచ్చింది. మోహిత్ వేసిన ఐదవ బంతికి రవీంద్ర జడేజా భారీ సిక్స్ బాధగా.. చివరి బంతికి ఉత్కంఠ నెలకొంది. మోహిత్ ఆఖరి బంతిని పూర్తిగా లెగ్ సైడ్ వేయడంతో.. జడేజా బ్యాక్ సైడ్ షాట్ ఆడాడు. కీపర్, స్లిప్ మధ్య నుంచి వెళ్లిన బంతి బౌండరీ వెళ్ళింది. దాంతో చెన్నై విజయం సాధించింది. 


ఎంత పెద్ద విజయమైనా, ఘోర పరాజయమైనా ఎంతో కూల్‌గా ఉండే ఎంఎస్ ధోనీ.. మైదానంలో మాత్రం ఎలాంటి భావోద్వేగాలు ప్రదర్శించడు. అయితే ఈ మ్యాచ్‌లో మహీ ఉద్వేగానికి లోనయ్యాడు. చివరి రెండు బంతుల సమయంలో ధోనీ కళ్లు మూసుకుని ఉండడం కెమెరాల్లో చిక్కింది. జడేజా అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించడంతో.. ధోనీ సంతోషానికి అవదుల్లేకుండా పోయాయి. ఆనందంతో జడేజాను హత్తుకొని ఎత్తుకున్నాడు. ఆ సమయంలో మహీ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


Also Read: Disha Patani Pics: తెగించేసిన హాట్ భామ దిశా పటాని.. హాట్ సమ్మర్‌లో మరింత హీటెక్కిస్తున్న లోఫర్ బ్యూటీ!  



ఈ మ్యాచులో టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌ (96; 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) తృటిలో సెంచరీ కోల్పోగా.. వృద్ధిమాన్‌ సాహా (54; 39 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) శుబ్‌మన్‌ గిల్‌ (39; 20 బంతుల్లో 7 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసి గెలిచింది.దేవాన్ కాన్వే (47; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్‌ దూబే (32 నాటౌట్‌; 21 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు.  



Also Read: Who Is Sai Sudharsan: చెన్నైకి చుక్కలు చూపించిన సాయి సుదర్శన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , FacebooKమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి