Who Is Sai Sudharsan: చెన్నైకి చుక్కలు చూపించిన సాయి సుదర్శన్ ఎవరో తెలుసా..?

IPL 2023 Final Match Highlights: సాయి సుదర్శన్ బ్యాగ్రౌండ్ చూస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ యువ ఆటగాడిని ఎందుకు ఇగ్నోర్ చేసిందబ్బా అనే సందేహం రాకమానదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సాయి సుదర్శన్‌కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి అనే కదా మీ డౌట్.. అయితే ఇదిగో ఈ డీటేల్స్ చూడండి.. అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.

Written by - Pavan | Last Updated : Jun 1, 2023, 10:28 AM IST
Who Is Sai Sudharsan: చెన్నైకి చుక్కలు చూపించిన సాయి సుదర్శన్ ఎవరో తెలుసా..?

IPL 2023 Final Match Highlights: ఐపిఎల్ 2023 ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సోమవారం చెన్నై సూపర్ కింగ్స్‌ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ టైటాన్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 214 చేసి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ముందు భారీ స్కోర్‌ని లక్ష్యంగా విధించింది. గుజరాత్ టైటాన్స్ ఈ భారీ స్కోర్ చేయడంలో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 47 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లు బాది మొత్తం 96 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 

ఈ ఐపీఎల్ సీజన్‌లో సాయి సుదర్శన్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ కాగా.. మొత్తం ఐపిఎల్ టోర్నమెంట్స్‌లో అతడు నాలుగు హాఫ్ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. ఈ ఏడాది చేసిన మరో రెండు హాఫ్ సెంచరీలలో ఒకటి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై కాగా.. మరొకటి కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చేశాడు. ఐపిఎల్ 2022 వేలంలో ఈ యువ ఆటగాడి గుజరాత్ టైటాన్స్ జట్టు యాజమాన్యం 20 లక్షల రూపాయలకు సొంతం చేసుకుంది.

సాయి సుదర్శన్ బ్యాగ్రౌండ్ విషయానికొస్తే.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై గుజరాత్ టైటాన్స్‌కి భారీ స్కోర్‌ని అందించడంలో కీలక పాత్ర పోషించిన ఈ ఆటగాడు పుట్టింది మరెక్కడో కాదు.. చెన్నైలోనే. సాయి సుదర్శన్ తండ్రి 1993లో  సౌత్ ఏషియన్ గేమ్స్‌లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించిన జాతీయ స్థాయి అథ్లెట్ కాగా.. సుదర్శన్ తల్లి స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ కావడం విశేషం.

ఇది కూడా చదవండి : Hardik Pandya-MS Dhoni: ఎంఎస్ ధోనీని హార్దిక్ పాండ్యా గుర్తు చేస్తున్నాడు: సునీల్ గవాస్కర్

చిన్న వయస్సులోనే క్రికెట్ ఆడటం మొదలుపెట్టిన సాయి సుదర్శన్.. 2019 - 20 లలో రాజా ఆఫ్ పాలయంపట్టి షీల్డ్‌లో అల్వార్‌పేట సీసీ తరపున 635 పరుగులు చేయడంతో తొలిసారిగా లైమ్‌లైట్‌ లోకి వచ్చాడు. 2021లో తమిళనాడు తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ ఎంట్రీ ఇచ్చాడు. ఈ రెండింటిలో అతడి పర్‌ఫార్మెన్స్ చూసిన లైకా కోవల్ కింగ్స్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అతడికి తమ జట్టులో చోటు కల్పించింది.

తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో 8 ఇన్నింగ్స్‌లో 143.77 స్ట్రైక్ రేట్‌తో 358 పరుగులు చేసి ఆకట్టుకోవడమే కాకుండా.. అత్యధిక పరుగులు చేసిన 2వ ఆటగాడిగా, లైకా కోవల్ కింగ్స్‌ జట్టును నాకౌట్ దశ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిన బ్యాట్స్‌మెన్‌గా పేరు సొంతం చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి : MS Dhoni Fans: ఎంఎస్ ధోనీని చూడటం కోసమే ఈ జాబ్‌ చేస్తున్నా!

ఇలా గుడ్ ట్రాక్ రికార్డుతో ఉన్న సాయి సుదర్శన్‌ని 2022 లో జరిగిన ఐపిఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫ్రాంచైజీ సెలెక్ట్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్... మొత్తానికి తన మార్క్ చూపించుకోవడంలో విజయవంతమయ్యాడు. తమాషా చూశారా.. చెన్నైలో పుట్టి పెరిగిన ఆటగాడు.. చెన్నై జట్టుకే చుక్కలు చూపించాడు. కొసమెరుపు ఏంటంటే.. ప్రపంచంలోనే రిచెస్ట్ గేమ్‌గా పేరున్న ఐపిఎల్ కంటే.. సాయి సుదర్శన్‌కి తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో లభించే రెమ్యునరేషనే ఎక్కువ. అవును.. సాయి సుదర్శన్‌కి గుజరాత్ టైటాన్స్ 20 లక్షలు చెల్లించగా.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ కోసం లైకా కోవై కింగ్స్ యాజమాన్యం అతడికి 21.60 లక్షలు చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం.

ఇది కూడా చదవండి : IPL 2023 Records: ఐపీఎల్‌ 2023లో అత్యంత వేగవంతమైన బాల్స్ ఇవే.. ఎవరు వేశారంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News