Naveen Ul Haq Trolls: నవీన్-ఉల్-హక్కు కౌంటర్ ఇచ్చిన ముంబై ప్లేయర్లు.. తియ్యగుందా..?
Naveen Ul Haq Vs Virat Kohli Fans: ఈ సీజన్ సాఫీగా సాగిపోతున్న తరుణంలో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య వాగ్వాదం ఒక్కసారిగా హీట్ పుట్టించింది. వీరిద్దరి మధ్య గొడవ తరువాత కోహ్లీ సైలెంట్ అయినా.. నవీన్ మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. ముంబై చేతిలో లక్నో ఓటమి తరువాత నవీన్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది.
Naveen Ul Haq Vs Virat Kohli Fans: లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ నవీన్ ఉల్ హక్‌ను కోహ్లీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు. ప్లేఆఫ్స్‌లో ముంబై చేతిలో లక్నో ఓడిపోయిన తరువాత నవీన్‌పై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది. అంతేకాకుండా జొమాటో, స్విగ్గీలు సెటైర్లు వేస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సందీప్ వారియర్, కుమార్ కార్తికేయ, విష్ణు వినోద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వెరైటీ ఫొటోతో కౌంటర్ ఇచ్చారు. ముందు మామిడి పళ్లు పెట్టుకుని.. "చెడు చూడకు.. చెడు వినకు.. చెడు మాట్లాడకు.." అని చూపించేలా కళ్లు, నోరు, చెవులు మూసుకుని ట్రోల్ చేశారు. 'సీజన్‌లో తీపి మామిడి' అంటూ సోషల్ మీడియాలో ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.
అయితే ఈ పోస్ట్‌ను తొలగించినా.. అప్పటికే అభిమానులు స్క్రీన్‌షాట్ తీసుకుని నెట్టింట వైరల్ చేస్తున్నారు. బుధవారం రాత్రి ముంబై కెప్టెన్ రోహత్ శర్మను నవీన్ ఉల్ హక్ ఔట్ చేసిన అనంతరం రాహుల్ స్టైల్‌లో చెవిపై చేయి పెట్టుకుని సంబరాలు జరుపుకున్నాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచి అనంతరం ఆ జట్టలు ఆటగాళ్లు నవీన్-ఉల్-హక్‌ను ట్రోల్ చేశారు. ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ, జొమాటో కూడా ట్రోల్ చేశాయి. నవీన్ బ్యాటింగ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన జొమాటో.. ‘నాట్ సో స్వీట్ మ్యాంగోస్’ అని క్యాప్షన్ ఇచ్చింది. మామిడి పండ్లను కట్ చేసిన ఫోటోను పంచుకుని స్విగ్గీ ట్రోల్ చేసింది. ముంబైతో మ్యాచ్ అనంతరం ట్రోలింగ్‌తో నవీన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు.
లక్నో సూపర్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీతో నవీన్ వాగ్వాదానికి గురైన విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్యలో గౌతమ్ గంభీర్ కూడా చేరడంతో పెద్ద రచ్చే జరిగింది. ఈ ముగ్గురిపై మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ బీసీసీఐ చర్యలు కూడా తీసుకుంది. ప్లేఆఫ్స్ చేరాలంటే గుజరాత్ టైటాన్స్‌పై తప్పకుండా నెగ్గాల్సిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఓడిపోయినప్పుడు నవీన్ మరోసారి వివాదానికి తెరలేపాడు. మామిడితో ఉన్న ఫోటోను పంచుకుని సంబురాలు చేసుకుంటున్నట్లు సింబాలిక్‌గా చెప్పాడు. సమయం కోసం ఎదురు చూసిన కోహ్లీ ఫ్యాన్స్.. ముంబై చేతిలో లక్నో ఓడిపోగా.. అవే మామిడి పళ్లతో ట్రోల్ చేస్తున్నారు.
Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి