Gujarat Titans won by 6 wkts vs Punjab Kings in IPL 2023: ఐపీఎల్‌ 2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ మరో బంతి ఉండగా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శుభ్‌మన్‌ గిల్‌ (67; 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం చేయగా.. వృద్ధిమాన్‌ సాహా (30; 19 బంతుల్లో 5 ఫోర్లు) రాణించాడు. సాయి సుదర్శన్‌ (19; 20 బంతుల్లో 2 ఫోర్లు), డేవిడ్ మిల్లర్ (17) పర్వాలేదనిపించారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్, కాగిసో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్‌, సామ్‌ కరన్‌ తలో ఒక్కో వికెట్ పడగొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్ జట్టుకు మంచి ఆరంభమే దక్కింది. శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. సాహా ఔట్ అనంతరం సాయి సుదర్శన్‌ అండతో గిల్‌ పరుగులు చేశాడు. సుదర్శన్‌, హార్దిక్ పాండ్యా పెవిలియన్ చేరినా.. గిల్ గుజరాత్ స్కోరును నడిపించాడు. ఈ క్రమంలోనే అతడు హాఫ్ సెంచరీ బాదాడు.


సామ్‌ కరన్‌ వేసిన చివరి ఓవర్‌లో గుజరాత్‌ టైటాన్స్ విజయానికి 7 పరుగులు అవసరం అయ్యాయి. మొదట బంతికి డేవిడ్ మిల్లర్ సింగిల్‌ తీశాడు. రెండో బంతికి గిల్ క్లీన్‌బౌల్డ్‌ కావడంతో.. మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. తర్వాతి రెండు బంతులకు రెండు పరుగులే రావడంతో.. మ్యాచ్‌ చివరి బంతికి వరకు వెళ్లేలా కనిపించింది. అయితే ఐదో బంతికి రాహుల్ తెవాతియా (5) ఫోర్‌ బాది ఉత్కంఠతకు తెరదించాడు. 
 
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (36; 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్. జితేశ్‌ శర్మ (25;  23 బంతుల్లో 5 ఫోర్లు), సామ్‌ కరన్‌ (22), షారూఖ్‌ ఖాన్‌ (22), భానుక రాజపక్స (20) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్‌ శర్మ రెండు వికెట్స్ పడగొట్టగా.. మొహ్మద్ షమీ, జాషువా లిటిల్‌, అల్జారీ జోసెఫ్‌, రషీద్ ఖాన్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.


Also Read: MS Dhoni Tweet: వైరల్‌గా మారిన 9 ఏళ్ల క్రితం నాటి ఎంఎస్ ధోనీ ట్వీట్.. మహీ చెప్పినట్లుగానే చేశాడు!  


Also Read: WTC Final 2023: ఒకే ఒక్క ఇన్నింగ్స్.. అజింక్య రహానేకు బంపరాఫర్‌! సూర్యకు నో ఛాన్స్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.