CSK Captain MS Dhoni 9 year old Tweet Goes Viral after Chennai Super Kings defeated by Rajasthan Royals: బుధవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డేవాన్ కాన్వే (50; 38 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా.. ఎంఎస్ ధోనీ (32; 17 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (25; 15 బంతుల్లో 1 ఫోర్లు, 2 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకుండా పోయింది. చెన్నై మ్యాచ్ ఓడినా.. ఆ జట్టు ఫాన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు కారణం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీనే.
చెన్నై చివరి ఓవర్‌లో 21 పరుగులు చేయాల్సి ఉంది. ఈ పరుగులు చూస్తే అందరూ మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంటారు. అయితే మంచి ఫినిషర్‌గా పేరున్న ఎంఎస్ ధోనీ క్రీజులో ఉండడంతో చెన్నై ఫాన్స్ మాత్రం విజయంపై నమ్మకంగా ఉన్నారు. మైదానంలోని ప్రేక్షకులు, ఫాన్స్ అంచనాలను నిజం చేస్తూ.. చివరి ఓవర్లో మహీ చెలరేగిపోయాడు. చివరి ఓవర్లో 2, 3 బంతులకు సిక్సర్లు బాదాడు. దాంతో ఒకప్పటి ధోనీని గుర్తుచేశాడు. ధోనీ సిక్సులు కొట్టడంతో చెపాక్ స్టేడియం మార్మోగిపోయింది. విజయం చెన్నైదే అనుకున్నా.. రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ అద్భుతంగా బౌలింగ్ చేసి ధోనీ దూకుడుకు కళ్లెం వేశాడు.
చెన్నై మ్యాచ్ ఓడినప్పటికీ చివర్లో ఎంఎస్ ధోనీ షాట్లు చూసిన అభిమానులు సంతోషంగా ఫీల్ అయ్యారు. 'మ్యాచ్ పోయినా.. పాత మహీని గుర్తు చేశాడు’ అని ఆనందంగా ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలోనే 9 ఏళ్ల క్రితం ఎంఎస్ ధోనీ పాత ట్వీట్‌ను ఫాన్స్ వైరల్ చేస్తున్నారు. 'మ్యాచ్‌లో ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు. ప్రేక్షకులను రంజింపజేయడానికే నేను ఇక్కడున్నా' అని ధోనీ గతంలో ట్వీట్ చేశాడు. 2014 మార్చి 24న మహీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 9 ఏళ్ల తర్వాత ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది. మ్యాచ్ అనంతరం ఫాన్స్ ఆ ట్వీట్ స్క్రీన్ షాట్‌ను పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
ఎంఎస్ ధోనీ చెప్పినట్లుగానే చేశాడు, ఐ లవ్ ఎంఎస్ ధోనీ అంటూ పలువురు అభిమానులు ఆ ట్వీటుకి పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ధోనీ 32 పరుగులు చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు ఎంఎస్ రిటైర్మెంట్ ఇచ్చి మూడేళ్లు అయింది. దాంతో ధోనీ ఆటను చూసేందుకు ఏకైక అవకాశం ఐపీఎల్ కావడంతో.. అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐపీఎల్ 2023లో మహీ సిక్సులతో అలరిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: WTC Final 2023: ఒకే ఒక్క ఇన్నింగ్స్.. అజింక్య రహానేకు బంపరాఫర్! సూర్యకు నో ఛాన్స్
Also Read: PBKS vs GT: టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్.. రెండు మార్పులతో బరిలోకి పంజాబ్ కింగ్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.