Jonny Bairstow Ruled Out of IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 సీజన్ ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది.. కీలక ఆటగాళ్లు గాయం నుంచి దూరమవ్వడం క్రికెట్ అభిమానులకు నిరాశకు గురిచేస్తోంది. ప్రధాన ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా జానీ బెయిర్‌స్టో కూడా ఈ ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ముందు స్నేహితులతో బెయిర్ స్టో గోల్ఫ్ ఆడుతూ గాయపడ్డాడు. అతడికి లిగమెంట్ డ్యామేజీ కావడంతో అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. అయితే గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఐపీఎల్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ప్రస్తుతం బెయిర్‌స్టో గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల ఐపీఎల్ సీజన్‌లో ఆడడం లేదని తెలుస్తోంది. 


ఎడమ కాలు ఫ్రాక్చర్ కావడంతోపాటు చీలమండ కూడా మెలితిరిగింది. అతను లండన్‌లో శస్త్రచికిత్స చేయించుకోగా.. కాలులో మెటల్ ప్లేట్ చొప్పించారు. దీంతో జానీ బెయిర్‌స్టో మరికొంత కాలం మైదానానికి దూరంగా ఉండబోతున్నాడు. అయితే బెయిర్‌స్టోకు సంబంధించి ఇప్పటి వరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, పంజాబ్ కింగ్స్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.


వచ్చే ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు శిఖర్ ధావన్ కెప్టెన్సీలో ఆడనుంది. ఏప్రిల్ 1న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో జట్టు తమ ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. గతేడాది జరిగిన మెగా వేలంలో రూ.6.75 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి పంజాబ్ కింగ్స్ బెయిర్‌స్టోను కొనుగోలు చేసింది. జూన్‌లో ఆడబోయే యాషెస్‌ సిరీస్‌ కల్లా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.  


2019లో జానీ బెయిర్‌స్టో తొలిసారిగా ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 39 మ్యాచ్‌లు ఆడాడు. 1291 పరుగులు చేయగా.. ఇందులో 9 అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. గత సీజన్‌లో బెయిర్‌స్టో 11 మ్యాచ్‌లు ఆడి.. 253 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో జానీ బెయిర్‌స్టో నిష్క్రమించడం పంజాబ్ కింగ్స్‌కు పెద్ద దెబ్బే. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుఫున బెయిర్ స్టో ఎన్నో అద్భతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.


పంజాబ్ కింగ్స్ జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ తైడే, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ సింగ్ భాటియా, విధ్వత్ కవేరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్.


Also Read: MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  


Also Read: MLC Kavitha: వరుసగా ఫోన్లను మార్చిన ఎమ్మెల్సీ కవిత.. రహాస్య వ్యవహారాల కోసమేనా..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి